Share News

Lok Sabha Polls 2024: తెలంగాణలో మళ్లీ మొదలైన ఫ్లెక్సీ వార్.. మోదీ హామీలను టార్గెట్ చేస్తూ..

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:46 AM

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో.. తెలంగాణలో మళ్లీ ఫ్లెక్సీ వార్ మొదలైంది. బీజేపీని టార్గెట్ చేస్తూ.. గాంధీభవన్ ఎదుట ‘నయవంచన’ పేరుతో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ‘‘పదేండ్ల మోసం - వందేళ్ల విధ్వంసం’’ అంటూ..

Lok Sabha Polls 2024: తెలంగాణలో మళ్లీ మొదలైన ఫ్లెక్సీ వార్.. మోదీ హామీలను టార్గెట్ చేస్తూ..
Flexi War Started In Telangana

దేశంలో సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Elections 2024) జరుగుతున్న తరుణంలో.. తెలంగాణలో మళ్లీ ఫ్లెక్సీ వార్ మొదలైంది. బీజేపీని (BJP) టార్గెట్ చేస్తూ.. గాంధీభవన్ (Gandhi Bhavan) ఎదుట ‘నయవంచన’ పేరుతో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ‘‘పదేండ్ల మోసం - వందేళ్ల విధ్వంసం’’ అంటూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఇచ్చిన హామీలకు విరుద్ధంగా మోదీ ప్రభుత్వం సాగిందని అందులో ఎత్తిచూపారు.


ధోనీకేమో అలా.. రుతురాజ్‌కి ఇలా.. ఇదెక్కడి న్యాయం?

2014 ఎన్నికల సమయంలో సంవత్సరానికి రెండు కోట్లు చొప్పున ఉద్యోగాలు ఇస్తామని మోదీ (PM Narendra Modi) హామీ ఇచ్చారని.. మరి మీ పదేళ్ల పాలనలో 20 కోట్లు ఉద్యోగాలు ఇచ్చారా? అని ఆ ఫ్లెక్సీలో ప్రశ్నించారు. తెలంగాణకు ఒక్క యూనివర్సిటీ కూడా ఇవ్వని బీజేపీ ప్రభుత్వం.. కృష్ణా జిల్లాలో ఆంధ్రాకే ఎక్కువ వాటా ఇచ్చారని పేర్కొన్నారు. గత పదేండ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్న అంశాన్ని కూడా హైలైట్ చేశారు. గతంలో తాము అధికారంలోకి వస్తే నిత్యావసరాలతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని తగ్గిస్తామని మోదీ ఇచ్చారని.. కానీ అందుకు భిన్నంగా వాటి ధరలు ఆకాశాన్నంటాయని రాసుకొచ్చారు. ధరలు పెంచేసి, పేదలపై ఆర్థిక భారం మోపారంటూ ఆరోపించారు. అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి, ఆ హామీని తుంగలో తొక్కేశారన్నట్టుగా ఫ్లెక్సీని డిజైన్ చేశారు.

సొంత పార్టీ అభ్యర్థికి ఓటేయొద్దంటూ కాంగ్రెస్ ప్రచారం.. ఎందుకో తెలుసా?

అలాగే.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మోదీ మాటిచ్చారని, అవినీతిని కూడా రూపుమాపుతామని చెప్పారని, మరీ ఈ పదేళ్లలో అవి జరిగాయా? అని ప్రశ్నిస్తున్నట్టు ఫ్లెక్సీలో చిత్రాలను డిజైన్ చేశారు. విదేశాల్లో నల్లధనాన్ని వెనక్కు తీసుకొచ్చి, ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని మోదీ హామీని గుర్తు చేస్తూ.. మా రూ.15 లక్షలు ఎక్కడ అని నిలదీశారు. సరిహద్దులో చైనా భారత భూభాగాన్ని ఆక్రమిస్తుంటే.. చైనా ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదంటూ అబద్ధాలు చెప్తున్నారని పేర్కొన్నారు. తీవ్రవాదాన్ని నిర్మూలిస్తామన్న మాటని సైతం గాలికొదిలేశారన్న అర్థం వచ్చేలా ఫ్లెక్సీలో ఫోటోల్ని అమర్చారు. మరి.. దీనికి కౌంటర్‌గా బీజేపీ వాళ్లు ఎలాంటి ఫ్లెక్సీలని దింపుతారో చూడాలి.

Read Latest Telangana News and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 12:10 PM