Share News

Lok Sabha Polls: రాజాసింగ్‌ డుమ్మా వెనుక ఉన్న మతలబు ఏమిటో..?

ABN , Publish Date - Apr 25 , 2024 | 10:02 AM

హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత(BJP candidate Kompella Madhavilatha) బుధవారం తన నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఆ పార్టీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌(Goshamahal MLA Rajasingh) ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది.

Lok Sabha Polls: రాజాసింగ్‌ డుమ్మా వెనుక ఉన్న మతలబు ఏమిటో..?

  • ర్యాలీలోనూ పాల్గొనని గోషామహల్‌ ఎమ్మెల్యే

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత(BJP candidate Kompella Madhavilatha) బుధవారం తన నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఆ పార్టీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌(Goshamahal MLA Rajasingh) ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. మాధవీలత నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కేంద్రమంత్రి అనురాగ్‌ సింగ్‌ పాల్గొన్నప్పటికీ ఎమ్మెల్యే మాత్రం ఎక్కడా కానరాలేదు. శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. కానీ మాధవీలత ప్రచారంలో గానీ, సభలు, సమావేశాల్లో గానీ రాజాసింగ్‌ కనిపించలేదు. హనుమాన్‌జయంతి ర్యాలీలో పాల్గొన్న సమయంలో ఆయన మాట్లాడుతూ ఎక్కడ పనిచేయమని పారీఒ ఆదేశిస్తే అక్కడ చేస్తానని చెప్పారు. కానీ హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో గోషామహల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ అయినా రాజాసింగ్‌ పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇదికూడా చదవండి: Khammam: నామ నాగేశ్వరరావు ఆస్తులు రూ.155 కోట్లు

Asaduddin-Vs-Madhavi-Latha.jpg

ఈ నెల మొదట్లో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరిగిన బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జీ బాధ్యతలను గతంలో రాజాసింగ్‌కు పార్టీ అప్పగించినా ఆయన పెద్దగా దృష్టిపెట్టలేదు. బీజేపీ తొలి జాబితాలో పేరు ప్రకటించినప్పటి నుంచి హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో మాధవీలత విస్తృతంగా పర్యటిస్తున్నా.. రాజాసింగ్‌ ఎక్కడా కనిపించడంలేదు. ఆమె పేరును ప్రకటించినప్పటి నుంచి రాజాసింగ్‌ కినుక వహించినట్టు తెలుస్తోంది.

ఇదికూడా చదవండి: Union Minister: ఒక మహిళ చేతిలో ఒవైసీ ఓటమి ఖాయం..

Read Latest National News and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 10:17 AM