Share News

Loksabha Elections 2024: అభ్యర్థుల నామినేషన్లపై తెలంగాణ బీజేపీ నయా ప్లాన్.. తరలిరానున్న నేషనల్ లీడర్స్

ABN , Publish Date - Apr 17 , 2024 | 04:20 PM

Telangana: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఇక రేపటి (గురువారం) నుంచి నామినేషన్ల ఘట్టం కూడా మొదలుకానుంది. దీంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటు తెలంగాణ బీజేపీ మాత్రం నామినేషన్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈసారి సరికొత్త రీతిలో నామినేషన్లను వేయించాలని బీజేపీ నిర్ణయించింది.

Loksabha Elections 2024: అభ్యర్థుల నామినేషన్లపై తెలంగాణ బీజేపీ నయా ప్లాన్.. తరలిరానున్న నేషనల్ లీడర్స్
Telangana BJP special focus on Nominations

హైదరాబాద్, ఏప్రిల్ 17: తెలంగాణ రాష్ట్రంలో (Telangana State) త్వరలో పార్లమెంట్ ఎన్నికలు (Loksabha Elections 2024) జరుగనున్నాయి. ఇక రేపటి (గురువారం) నుంచి నామినేషన్ల ఘట్టం కూడా మొదలుకానుంది. దీంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటు తెలంగాణ బీజేపీ (Telangana BJP) మాత్రం నామినేషన్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈసారి సరికొత్త రీతిలో నామినేషన్లను వేయించాలని బీజేపీ నిర్ణయించింది. నామినేషన్ కార్యక్రమాలను గ్రాండ్‌గా నిర్వహించేలా ప్రణాళికను రూపొందించింది బీజేపీ కార్యాలయం.

AP Election 2024: సీఎం జగన్ దంపతులపై బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు


అభ్యర్ధుల నామినేషన్‌లకు గెస్ట్‌లుగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎంలు వచ్చేలా ప్లాన్ చేసింది. అనుకున్నదే తడువుగా జాతీయ నేతలకు స్టేట్ బీజేపీ ఆహ్వానాలు పంపింది కూడా. ఇక.. బీజేపీ అభ్యర్ధుల నామిషన్‌ కోసం గుజరాత్ ముఖ్యమంత్రి, ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఒక్కో అభ్యర్ధి నామినేషన్ రోజు ఒక్కో నేషనల్ లీడర్ ఉండేలా తెలంగాణ బీజేపీ షెడ్యూల్ ఫిక్స్ చేసింది.

AP Politics: నెగిటివ్‌ను పాజిటివ్‌గా మార్చుకునే కుట్ర జరుగుతుందా..?


ఏయే అభ్యర్థికి.. ఎవరెవరు రానున్నారో చూద్దాం...

1) మెదక్ - రఘునందన్ రావు, 18న నామినేషన్

గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరు.

2) మల్కాజ్ గిరి - ఈటల రాజేందర్, 18 న నామినేషన్

కేంద్ర మంత్రి హార్డీప్ సింగ్ పూరీ హాజరు

3) మహబూబ్ నగర్ - డీకే అరుణ,18 న నామినేషన్

4) సికింద్రబాద్ - కిషన్ రెడ్డి,19 న నామినేషన్

వీరికి కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరు

5) ఖమ్మం - తాండ్ర వినోద్ రావు, 19 న నామినేషన్

కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరు

6) జహీరాబాద్ - బీబీ పాటిల్, 22న నామినేషన్

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరు

7) చేవెళ్ళ - కొండా విశ్వేశ్వర్ రెడ్డి, 22 నామినేషన్

కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ హాజరు

8) నల్గొండ - సైది రెడ్డి, 22 న నామినేషన్

కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ హాజరు

9) మహబూబాబాద్ - సీతారం నాయక్, 22న నామినేషన్

కేంద్ర మంత్రి కిరణ్ రిజుజి హాజరు

10) భువన గిరి - బూర నర్సయ్య గౌడ్, 23 న నామినేషన్

11) పెద్దపల్లి - గోమాస శ్రీనివాస్ 24 న నామినేషన్

వీరికి కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ హాజరు

12) అదిలాబాద్ - నగేశ్ 24న నామినేషన్

ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయ్ హాజరు

13) హైదరబాద్ - మాధవి లత 24న నామినేషన్

కేంద్ర సమాచార శాఖ మంత్రి అరుణ్ ఠాకూర్ హాజరు

14) వరంగల్ - అరూరి రమేష్, 24న నామినేషన్

కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్వినీ వైష్ణవ్ హాజరు

15) కరీంనగర్ - బండి సంజయ్, 25 న నామినేషన్

గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డి హాజరు

16) నిజామాబాద్ - అరవింద్, 25న నామినేషన్

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ హాజరు

17) నాగర్ కర్నూల్ - భరత్, 25న నామినేషన్

గుజరాత్ సీఎం భూపేంద్రా పటేల్, కిషన్ రెడ్డి హాజరు


ఇవి కూడా చదవండి...

Komatireddy: కాంగ్రెస్‌ను టచ్ చేసి చూడు.. కేసీఆర్‌కు కోమటిరెడ్డి హెచ్చరిక

Bhadrachalam: సీతమ్మ మెడలో పుస్తె కట్టిన రామయ్య.. భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం కమనీయం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 17 , 2024 | 04:20 PM