Share News

AP Elections: మైలవరంలో రెండో రోజు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం

ABN , Publish Date - Apr 26 , 2024 | 10:20 AM

Andhrapradesh: కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటిమికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధి పక్కా అని చెబుతూ వసంత కృష్ణప్రసాద్ ముందుకు సాగుతున్నారు.

AP Elections: మైలవరంలో రెండో రోజు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం

ఎన్టీఆర్ జిల్లా, ఏప్రిల్ 26: కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ (MLA Vasanta Krishna Prasad) ఎన్నికల ప్రచారం (Election Campaign) జోరుగా సాగుతోంది. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటిమికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధి పక్కా అని చెబుతూ వసంత కృష్ణప్రసాద్ ముందుకు సాగుతున్నారు. మైలవరంలో రెండో రోజు ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.

Amit Shah: ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం


నియోజకవర్గ కేంద్రమైన మైలవరంలోని 2, 3 వార్డులలో ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంతకు మహిళలు హారతులు పడుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తున్నారు. ఎమ్మెల్యే వసంతతో పాటు ప్రచారంలో భారీగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.

Delhi: రెండో విడత పోలింగ్ వేళ.. ఓటర్లకు ప్రధాని మోదీ కీలక సూచనలు


సతీమణి ప్రచారం...

మరోవైపు ఎమ్మెల్యే సతీమణి శిరీష కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తన భర్తను గెలిపించాలని కోరుతూ శిరీష ప్రచారం చేస్తున్నారు. గడప గడపకు తిరుగుతూ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల కలిగే ప్రయోజనాలు ఎమ్మెల్యే భార్య వివరిస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలను మహిళలు, పేదలకు వివరిస్తూ కృష్ణ ప్రసాద్ సతీమణి ప్రచారం నిర్వహిస్తున్నారు. శిరీషతో ఎన్నికల ప్రచారంలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొంటున్నారు.


ఇవి కూడా చదవండి...

Delhi: భార్య తెచ్చిన కట్నంపై భర్తకు హక్కు ఉండదు.. తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు

Hyderabad: దడ్‌.. దడ..! భయపెడుతున్న మెట్రోరైలు శబ్ధాలు

Read latest AP News And Telugu News

Updated Date - Apr 26 , 2024 | 11:04 AM