Share News

PM Modi: వైఎస్‌ జగన్‌పై ప్రధాని కన్నెర్ర.. అంతా అవినీతిమయం అంటూ ఫైర్..

ABN , Publish Date - May 06 , 2024 | 06:39 PM

వైసీపీ(YCP) పాలన అంతా అవినీతిమయం.. ఏపీలో(Andhra Pradesh) మాఫియా రాజ్యం నడుస్తోంటూ ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సోమవారం నాడు ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో..

PM Modi: వైఎస్‌ జగన్‌పై ప్రధాని కన్నెర్ర.. అంతా అవినీతిమయం అంటూ ఫైర్..
PM Narendra Modi

అనకాపల్లి, మే 05: వైసీపీ(YCP) పాలన అంతా అవినీతిమయం.. ఏపీలో(Andhra Pradesh) మాఫియా రాజ్యం నడుస్తోంటూ ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సోమవారం నాడు ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వమే ఏర్పడబోతోందన్నారు. కేంద్రంలోనూ ఎన్డీయే సర్కార్ వస్తుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదిగిందిని ప్రధాని చెప్పారు. చంద్రుడి దక్షిణ భాగంపై భారత్‌ అడుగు పెట్టిందని.. ప్రపంచంలోనే భారత్‌ గౌరవం పెరుగుతోందన్నారు.


ఏపీ అభివృద్ధిపై.. వైసీపీ అరాచకాలపై ప్రధాని షాకింగ్ కామెంట్స్..

అనకాపల్లి నుంచి అనంతపురం వరకు ఆరు లైన్ల రోడ్డు నిర్మించామని ప్రధాని మోదీ తెలిపారు. ఏపీ యువత కోసం ఎన్డీయే సర్కార్ పని చేస్తోందన్నారు. ఏపీకి ట్రిపుల్‌ఐటీ, ఐసర్‌, ఐఐఎం మంజూరు చేశామని ప్రధాని తెలిపారు. ఎన్డీయే మంత్రం అభివృద్ధి.. అభివృద్ధి.. అభివృద్ధి అని.. వైసీపీ మంత్రం అవినీతి..అవినీతి..అవినీతి.. అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రధాని మోదీ.


అంతేకాదు.. కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని ప్రధాని ఆరోపించారు. ఏపీ కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కానీ, వైసీపీ సర్కార్‌ మాత్రం ఏమీ చేయడం లేదని మోదీ విమర్శించారు. విశాఖ రైల్వే జోన్‌ ఆఫీస్‌కి వైసీపీ సర్కార్‌ భూమి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్రం భారీగా ఇళ్లు ఇచ్చినా ఈ ప్రభుత్వం నిర్మించలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును జగన్‌ తండ్రి ప్రారంభించారని.. పోలవరం నిర్మాణాన్ని మాత్రం జగన్‌ అడ్డుకుంటున్నారని ప్రధాని తీవ్ర విమర్శలు చేశారు.


వైసీపీ వల్లే అదంతా..

వైసీపీ ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఏపీలో అనేక చక్కెర పరిశ్రమలు మూత పడ్డాయని ప్రధాని మోదీ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో చెరుకు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో చెరుకు రైతుల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు ప్రధాని మోదీ. మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామని చెప్పారు. వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని.. కర్ణాటకలో ట్యాంకర్, భూమాఫియా ప్రభుత్వం నడుస్తుంటే.. ఏపీలో శాండ్, ల్యాండ్ మాఫియా విజృంభిస్తోందని విమర్శించారు ప్రధాని మోదీ.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 06 , 2024 | 06:39 PM