Share News

KA Paul: రేపు విశాఖలో నామినేషన్లు వేస్తున్నా..

ABN , Publish Date - Apr 17 , 2024 | 03:08 PM

Andhrapradesh: గాజువాక ఎమ్మెల్యేగా, విశాఖ ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. అలాగే రేపు విశాఖలో నామినేషన్లు వేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రలో 30 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే... తాను సీఎం అవుతానన్నారు. విశాఖను వాషింగ్టన్ డీసీగా..ఆంధ్రను అమెరికా చేసే సత్తా తనకుందని చెప్పుకొచ్చారు. మూడు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు.

KA Paul: రేపు విశాఖలో నామినేషన్లు వేస్తున్నా..
KA Paul Will File Nomination Tomorrow

విశాఖపట్నం, ఏప్రిల్ 17: గాజువాక ఎమ్మెల్యేగా, విశాఖ ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Prajashanti Party Chief KA Paul) ప్రకటించారు. అలాగే రేపు విశాఖలో నామినేషన్లు వేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రలో 30 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే... తాను సీఎం అవుతానన్నారు. విశాఖను వాషింగ్టన్ డీసీగా.. ఆంధ్రాను (Andhrapradesh) అమెరికా చేసే సత్తా తనకుందని చెప్పుకొచ్చారు. మూడు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. ‘‘నన్ను గెలిపిస్తే... మీరు షాక్ అవుతారు’’.. అంతా అభివృద్ధి చేస్తానంటూ ఆయన చెప్పారు.

AP Elections: టీడీపీ చీఫ్ చంద్రబాబు నామినేషన్ వేసేది ఎప్పుడో తెలుసా..!


చీకటి కావాలంటే ప్రతి పక్షాలను... వెలుగు కావాలంటే తనను గెలిపించాలని.. తెలివైన ఓట్లర్లు తనను గెలిపిస్తారన్నారు. ‘‘నన్ను చంపాలని చూస్తున్నారు... నాకు నరకం చూపిస్తున్నారు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడి కత్తి డ్రామా లాంటిదే గులక రాళ్ల దాడులు అని.. అధికార, ప్రతి పక్షాలు నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోదీని ఎదిరించే సత్తా తనకు తప్ప, ఎవరికీ లేదన్నారు. మోదీ బానిసలతో యుద్ధం చేస్తున్నానన్నారు. మళ్ళీ మోదీ వస్తే.. మణిపూర్ లాంటి ఘటనలు జరుగుతాయని వ్యాఖ్యలు చేశారు. మీడియాలో సమావేశంలో... ప్రజాశాంతి పార్టీ పాటను కేఏపాల్ ఆవిష్కరించారు. ‘‘ఈ పాటను గిఫ్ట్‌గా పంపించారు.. అలాగే మరొకరు కూడా నా ఒక పాట పంపారు’’ అని పాల్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

AP Politics: ‘బీ కేర్ ఫుల్ ఆఫీసర్స్’.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్..

AP News: జగన్‌పై రాయి దాడి ఘటనలో మరొకరి అరెస్ట్.... ఇదెక్కడి దారుణమంటున్న కుటుంబీకులు

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 17 , 2024 | 03:41 PM