Share News

AP Elections 2024: ఈ ఎన్నికల్లో కొడాలి నాని గూబ గుయ్యి మనేలా ఫలితాలు వస్తాయి: వెనిగండ్ల రాము

ABN , Publish Date - Apr 28 , 2024 | 10:12 PM

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani) గూబ గుయ్యి మనేలా ఈ ఎన్నికల్లో ఫలితాలు వస్తాయని గుడివాడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము (Venigandla Ramu) అన్నారు. ఈ ఎన్నికల్లో నాని ఘోరంగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరారు. టీడీపీలో 100మంది పండ్ల వర్తక సంఘ వ్యాపారులు, వైసీపీ కార్యకర్తలు చేరారు.

 AP Elections 2024: ఈ ఎన్నికల్లో కొడాలి నాని గూబ గుయ్యి మనేలా ఫలితాలు వస్తాయి: వెనిగండ్ల రాము

కృష్ణాజిల్లా (గుడివాడ): వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani) గూబ గుయ్యి మనేలా ఈ ఎన్నికల్లో ఫలితాలు వస్తాయని గుడివాడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము (Venigandla Ramu) అన్నారు. ఈ ఎన్నికల్లో నాని ఘోరంగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరారు. టీడీపీలో 100మంది పండ్ల వర్తక సంఘ వ్యాపారులు, వైసీపీ కార్యకర్తలు చేరారు.


Sharmila: సీఎం జగన్.. లాయర్ పొన్నవోలు మధ్య క్విడ్ ప్రోకో

పసుపు కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ.... గుడివాడలో వైసీపీ మొత్తం ఖాళీ అవుతోందన్నారు. ఎన్నికల అనంతరం ఆ పార్టీ కనిపించదని చెప్పారు. 2019లో చిరు వ్యాపారులందరూ వైసీపీకి మద్దతుగా నిలిచారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని కొడాలి నాని పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రజల బాధలు పట్టించుకోని ఎమ్మెల్యే తీరుపై విరక్తి చెంది ప్రజలందరూ చంద్రబాబు నాయకత్వానికి మద్దతుగా నిలవడం మంచి పరిణామమని తెలిపారు.


AP Elections: నీ అభిమానానికి ఫిదా.. చంద్రబాబు కోసం ఈయన ఏం చేశాడంటే..

నేడు పార్టీలో చేరిన చిరు వ్యాపారులందరికీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే చేయూతనిస్తామని హామీ ఇచ్చారు. గుడివాడలోని అన్నివర్గాల్లో మార్పు మొదలైందని చెప్పారు. ఎన్డీఏ కూటమిలో గుడివాడలో ఉండే చిన్న వ్యాపారులకు అండగా ఉంటామని మాటిచ్చారు. గుడివాడలో పండ్ల వర్తక సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలాన్ని ఇవ్వడమే కాక భవన నిర్మాణానికి సహకరిస్తామని వెనిగండ్ల రాము హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి

AP Elections 2024: ఏపీ రాజకీయాలపై జయప్రద ఇంట్రస్టింగ్ కామెంట్స్..

AP Elections 2024: ఓటు ఎవరికి వేశామో తెలుసుకోవచ్చు.. రండి ఇలా చెక్ చేసుకోండి!!

Updated Date - Apr 28 , 2024 | 10:22 PM