Share News

Lok Sabha Election 2024: తెలంగాణపై బీజేపీ అగ్రనేతల దండయాత్ర

ABN , Publish Date - May 07 , 2024 | 07:55 PM

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ (BJP) స్పీడప్ చేసింది. తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు వరుసగా దండయాత్ర మొదలెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు.

Lok Sabha Election 2024: తెలంగాణపై బీజేపీ అగ్రనేతల దండయాత్ర
BJP

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ (BJP) స్పీడప్ చేసింది. తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు వరుసగా దండయాత్ర మొదలెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ కేంద్ర అగ్రనేతల చరిష్మాతో ఈ ఎన్నికల్లో ప్రచారం చేయించాలా ప్లాన్ చేశారు. తెలంగాణకు కేంద్ర అగ్రనేతలు వరుసగా ప్రచార పర్వంలో దిగబోతున్నారు. ఈరోజు రాత్రి 7గంటలకు హైదరాబాద్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రానున్నారు. రేపు ఉదయం 8గంటలకు మోదీ వేములవాడ రాజన్న దర్శనం చేసుకోనున్నారు.


అనంతరం 9గంటలకు కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడ బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత వరంగల్‌కు వెళ్లి బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్‌ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తారు. ఉదయం 11గంటలకు వరంగల్‌లో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. మరోవైపు రేపు(బుధవారం) రాత్రికి హైదరాబాద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా రానున్నారు. ఎల్లుండి ఉదయం 9గంటలకు భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్ మద్దతుగా అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల9న (గురువారం) ఉదయం 9గంటలకు వరంగల్‌లో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 11గంటలకు జహీరాబాద్ పార్లమెంట్ బాన్సువాడలో రాజ్ నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

KTR: పిరమైన మోదీ గారూ.. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 07 , 2024 | 08:24 PM