Share News

Lok Sabha Election 2024: రాముడినీ సైతం బ్యాలెట్ బాక్స్‌లోకి లాగిన బీజేపీ: మంత్రి తుమ్మల

ABN , Publish Date - Apr 26 , 2024 | 08:32 PM

దేవుడు అయిన రాముడినీ సైతం బ్యాలెట్ బాక్స్‌లోకి తీసుకురావడం చాలా సిగ్గుచేటని.. ఆ దౌర్భాగ్య స్థితికి బీజేపీ (BJP) తెరలేపిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) ఆరోపించారు. ప్రధానమంత్రి స్థానంలో ఉండి నరేంద్రమోదీ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు.

Lok Sabha Election 2024: రాముడినీ సైతం బ్యాలెట్ బాక్స్‌లోకి లాగిన బీజేపీ: మంత్రి తుమ్మల
Thummala Nageswara Rao

భద్రాద్రి కొత్తగూడెం: దేవుడు అయిన రాముడినీ సైతం బ్యాలెట్ బాక్స్‌లోకి తీసుకురావడం చాలా సిగ్గుచేటని.. ఆ దౌర్భాగ్య స్థితికి బీజేపీ (BJP) తెరలేపిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) ఆరోపించారు. ప్రధానమంత్రి స్థానంలో ఉండి నరేంద్రమోదీ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. శుక్రవారం దమ్మపేట మండలం వడ్లగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గెలుపుని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.


CM Revanth: రుణమాఫీ చేసి తీరుతాం... హరీష్ రాజీనామా రెడీగా పెట్టుకో.. రేవంత్ కౌంటర్

ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామసహయం రఘురామ్ రెడ్డి మృదుస్వభావి అని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల మంగళసూత్రాలు తీసి ముస్లింలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందనే వ్యాఖ్యలు మోదీ చేయడం చాలా దౌర్భాగ్యమన్నారు. కేసీఅర్ మాజీ ముఖ్యమంత్రి కాగానే కరెంట్ లేదంటూ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఏర్పడి 4నెలలు అవ్వలేదని.. అప్పుడే రైతు రుణమాఫీ ఎప్పుడు మాఫీ చేస్తారు అంటూ మాట్లాడుతున్నారనారు.


Balmoor Venkat: అలాంటి వ్యక్తి వచ్చాడనే గన్‌పార్క్ వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేశా..

బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి కూడా లక్ష రూపాయలు రుణ మాఫీ ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేకుండా కేసీఆర్ ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్లారని మండిపడ్డారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. ఖమ్మం అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో రఘరాం రెడ్డిని ఎంపీగా గెలిపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.


Congress: హరీష్‌రావు రాజీనామా స్పీకర్ ఫార్మాట్‌లో లేదు: మంత్రి కోమటిరెడ్డి

అప్పుడు కేసీఆర్‌కి ప్రజల కష్టాలు తెలియలేదా..?: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Ponguleti-Srinivas-Reddy.jpg

కళ్ల బొల్లి కబుర్లు చెపుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌కి ప్రజల కష్టాలు తెలియలేదా అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasreddy) ప్రశ్నించారు. రాబోయే 5 సంవత్సరాల్లో ఇందిరమ్మ రాజ్యాంలో తెలంగాణను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రం నుంచి 17 ఎంపీ సీట్లు గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఆగస్ట్ 15వ తేదీలోపు రుణమాఫీ, అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు, తెల్ల రేషన్ కార్డులు అందచేస్తామని తెలిపారు.


కేసీఆర్ వారు కట్టిన ప్రాజెక్టులు చూడలేదు కానీ ఏసీ బస్సులో కూర్చుని కళ్ల బొల్లు కబుర్లు చెపుతున్నారని విరుచుకుపడ్డారు. వేసిన డ్రెస్ వేయకుండా, విదేశాల్లో తిరుగుతూ, ప్రజలను మోసం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డిని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు.

Kothakota Srinivas: ప్రభాకర్‌కు రెడ్‌ కార్నర్ నోటీసులపై హైదరాబాద్ సీపీ షాకింగ్ కామెంట్స్

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 26 , 2024 | 10:06 PM