కట్నం కోసం ఆ భర్త ఎంత పని చేశాడంటే.. తల్లిని, బిడ్డను వేరు చేసి బయటకు గెంటేసి..

ABN , First Publish Date - 2022-05-13T21:04:52+05:30 IST

ఎన్ని చట్టాలు చేసినా వరకట్నం అనే సాంఘిక దురాచారం దూరం కావడం లేదు.

కట్నం కోసం ఆ భర్త ఎంత పని చేశాడంటే.. తల్లిని, బిడ్డను వేరు చేసి బయటకు గెంటేసి..

ఎన్ని చట్టాలు చేసినా వరకట్నం అనే సాంఘిక దురాచారం దూరం కావడం లేదు. కట్నం తేలేదనే కారణంతో భార్యలను వేధింపులకు గురి చేస్తున్న, చంపేస్తున్న భర్తలు, అత్తమమాలు ప్రస్తుత సమాజంలో కూడా ఎంతో మంది ఉన్నారు. తాజాగా ఓ భర్త కట్నం తేలేదనే కారణంతో తన భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఆమెను చిత్ర హింసలు పెట్టాడు. ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. చివరకు కన్న కొడుకుని కూడా ఆమెకు దూరం చేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 


రాజస్థాన్‌లోని బన్స్‌వారాకు చెందిన బాధిత మహిళకు మూడేళ్ల కిందట వివాహం జరిగింది. ఈమెకు ఏడాదిన్నర వయసున్న కొడుకు ఉన్నాడు. రూ.2 లక్షల కట్నం తీసుకురావాల్సిందిగా ఈమెను భర్త వేధిస్తున్నాడు. అడిగినంత కట్నం తీసుకురాలేదనే కోపంతో ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించాడు. అయినా అన్నింటినీ ఆ మహిళ భరించి భర్తతో పాటు నివసించింది. మార్చి నెలలో ఆమెను భర్త ఇంటి నుంచి తరిమేశాడు. కట్నం తీసుకొస్తేనే ఇంటికి రానిస్తానని చెప్పేశాడు. 


దీంతో బాధిత మహిళ తన కొడుకుతో పాటు పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే నివసిస్తోంది. రెండు నెలలు గడిచినా భార్య కట్నంతో తిరిగి రాకపోవడంతో భర్త తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. భార్య పుట్టింటికి వెళ్లి కొడుకును ఎత్తుకొచ్చేశాడు. కట్నంతో వస్తేనే కొడుకును చూడనిస్తానని షరతు పెట్టాడు. తీవ్ర వేదనకు గురైన ఆ మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు.  

Read more