ఆగ్రో ఫారెస్ట్రీ నర్సరీని పరిశీలించిన అధికారుల బృందం

ABN , First Publish Date - 2022-05-14T04:31:06+05:30 IST

జేకే, ఎస్పీఎం ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న ఆగ్రో ఫారెస్ట్రీ నర్సరీని శుక్రవారం రాష్ట్ర ఉద్యానశాఖ డిప్యూటీడైరెక్టర్‌ విజయప్రసాద్‌తో పాటు అధికారులబృందం పరిశీలించింది.

ఆగ్రో ఫారెస్ట్రీ నర్సరీని పరిశీలించిన అధికారుల బృందం
ఆగ్రో ఫారెస్ట్రీ నర్సరీని పరిశీలిస్తున్న డిప్యూటీ డైరెక్టర్‌ విజయ ప్రసాద్‌

కాగజ్‌నగర్‌, మే 13: జేకే, ఎస్పీఎం ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న ఆగ్రో ఫారెస్ట్రీ నర్సరీని శుక్రవారం రాష్ట్ర ఉద్యానశాఖ డిప్యూటీడైరెక్టర్‌ విజయప్రసాద్‌తో పాటు అధికారులబృందం పరిశీలించింది. ఈ నర్సరీలో పెంచుతున్న మొక్కలను, అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో చేపడుతున్న పనుల తీరుతెన్నులను ప్లాంటేషన్‌శాస్త్రవేత్త కన్నన్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిప్యూటీడైరెక్టర్‌ విజయప్రసాద్‌ మాట్లా డుతూ ఉద్యానవనశాఖ నిర్వహిస్తున్న నర్సరీల్లో బార్డర్‌ ప్లాంటేషన్‌ కోసం కాసోరినా మొక్కలను పెం చాలన్నారు. ఈ మొక్కలతో రైతులకు మరింత ఆదా యం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ యాదగిరి, సువర్ణ, అహ్మద్‌, వివిధ ఉద్యాన అధికారులు పట్టుపరిశ్రమ అధికారి ఎంఏ అబ్దుల్‌ నదీం ఖుద్దీసి, సిబ్బంది పాల్గొన్నారు.

Read more