ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా Avinash Sable.. 30 ఏళ్లనాటి రికార్డు బద్దలు

ABN , First Publish Date - 2022-05-07T21:49:30+05:30 IST

భారత్‌కు చెందిన అవినాశ్ సబ్లే (Avinash Sable) 5000 మీటర్ల సౌండ్ రన్నింగ్ ట్రాక్ మీట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు

ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా Avinash Sable.. 30 ఏళ్లనాటి రికార్డు బద్దలు

న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన అవినాశ్ సబ్లే (Avinash Sable) 5000 మీటర్ల సౌండ్ రన్నింగ్ ట్రాక్ మీట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. అమెరికాలోని శాన్ జువాన్ కాపిస్ట్రానోలో జరిగిన పోటీల్లో 5 వేల మీటర్ల దూరాన్ని 13 నిమిషాల 25.65 సెకన్లలో అధిగమించి 12వ స్థానంలో నిలిచాడు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల సబ్లే ఆర్మీ ఉద్యోగి.


5 వేల మీటర్ల దూరాన్ని 13 నిమిషాల 25.26 సెకన్లలో చేరుకున్న సబ్లే 1992లో బహదూర్ ప్రసాద్ (Bahadur Prasad) సాధించిన రికార్డును చెరిపేశాడు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన పోటీల్లో ప్రసాద్ 13 నిమిషాల 29.70 సెకన్లలో అధిగమించాడు. ఇప్పటి వరకు అదే అత్యుత్తమ జాతీయ రికార్డు కాగా, ఇప్పుడా రికార్డును సబ్లే బద్దలుగొట్టాడు. తాజా పోటీల్లో 12వ స్థానంతో సరిపెట్టుకున్న సబ్లే ప్రస్తుతం అమెరికాలో ఉండి త్వరలో జరగనున్న అంతర్జాతీయ పోటీల కోసం సిద్ధమవుతున్నాడు.  

Read more