Aurangabad rally: Raj Thackeray ప్రసంగంపై కేసు

ABN , First Publish Date - 2022-05-03T22:17:44+05:30 IST

మే 2న ఔరంగాబాద్‌లో నిర్వహించిన సభలో విధ్వేష ప్రసంగాలు చేశారంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే సహా మరో ముగ్గురు కార్యక్రమ నిర్వాహకులపై ఔరంగాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారత శిక్షాస్మృతి కింద ‘అల్లర్లు సృష్టించే

Aurangabad rally: Raj Thackeray ప్రసంగంపై కేసు

ముంబై: మే 2న Aurangabadలో నిర్వహించిన సభలో విధ్వేష ప్రసంగాలు చేశారంటూ Maharashtra Nava Nirmana Sena అధినేత Raj Thackeray సహా మరో ముగ్గురు కార్యక్రమ నిర్వాహకులపై Aurangabad Police కేసు నమోదు చేశారు. భారత శిక్షాస్మృతి కింద ‘అల్లర్లు సృష్టించే విధంగా విధ్వేష వ్యాఖ్యలు చేయడం’, ‘పది మంది లేదా అంత కంటే ఎక్కువ మందిని నేరం చేసే విధంగా ప్రోత్సహించడం’ వంటి కారణాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. మే 4 లోపు మసీదుల వద్ద లౌడ్‌స్పీకర్లను తొలగించాలని లేదంటే Maharashtra సత్తా ఏంటో చూపిస్తామని Raj Thackeray అల్టిమేటం ఇచ్చారు. దీనికి ఒకరోజు ముందే ఆయనపై కేసు నమోదు కావడం గమనార్హం. ఇదీ కాకుండా 14 ఏళ్ల నాటి ఒక కేసులో ఆయనపై non-bailable warrant సైతం జారీ చేశారు.


కాగా, లౌడ్‌స్పీకర్లపై ఇంత పెద్ద దుమారం లేపిన రాజ్‌ థాకరే సోమవారం ఆశ్చర్యకర ప్రకటన చేశారు. మే 3న ఈద్ సందర్భంగా హనుమాన్ చాలీసా చదవొద్దని, ముస్లింలను ఈద్ పండగ చేసుకోనివ్వండంటూ పిలుపునిచ్చారు. తాము ఏ పండగకీ వ్యతిరేకం కాదని, అన్ని పండగలు జరుపుకోవాలని ఆయన అన్నారు. సోమవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘మే 3న ఈద్ ఉంది. సంబరాలను చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. అయితే మే 4 తర్వాత మాత్రం అస్సలు వినబోం.. మా డిమాండ్లను నెరవేర్చకుంటే రెట్టింపు శక్తితో హనుమాన్ చాలీసా పఠిస్తాం. మా అభ్యర్థన మీకు అర్థం కాకపోతే, మాకు తెలిసిన మార్గంలో పరిష్కరించుకుంటాం. మే 4 నుంచి నేను మౌనంగా ఉండబోను. అప్పటికి లౌడ్‌స్పీకర్లను తొలగించకుంటే, మహారాష్ట్ర బలం ఏమిటో చూపిస్తాను’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ముందు ‘‘మహారాష్ట్ర సైనికులకు’’ అని ఎంఎన్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి ట్వీట్ చేశారు.


మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు తీసేయకపోతే అక్కడే తాము హనుమాన్ చాలీసా పఠిస్తామని రాజ్ థాకరే ముందు నుంచి హెచ్చరికలు చేస్తున్నారు. మసీదుల వద్ద లౌడ్‌స్పీకర్లను మే 4 తేదీ లోపు తీసివేయకపోతే తమ పవరేంటో చూపిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇది వరకే హెచ్చరికలు చేశారు. అయితే మసీదుల వద్ద లౌడ్‌స్పీకర్లు తీసేయమనడం మతపరమైన అంశం కాదని, సామాజిక కోణంలోనే ఈ డిమాండ్ చేస్తున్నట్లు రాజ్ థాకరే చెప్తున్నారు.

Read more