
Chittoor: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu) గురువారం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా కుప్పం మండలం, చీగలపల్లె పటాలమ్మ (Patalamma) జాతరలో పాల్గొని అమ్మవారికి మెుక్కుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు శుభాకాంక్షలు (wishes) తెలిపారు. జాతర ఘణంగా చేసిన ఆలయ ట్రస్టుకు అభినందలను తెలిపారు. ఈ జాతర చూస్తుంటే తన చిన్న నాటి రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. ఈ పండుగకు ఇక్కడివారే కాకుండా పరిసర రాష్ట్రాలు కర్నాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి తరలి వచ్చిన భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. తాను అధికారంలోనికి రాగానే రాష్ట్ర పండుగగా పటాలమ్మ జాతరను ప్రకటిస్తామన్నారు. గతంలో తెలంగాణలో సమక్క.. సారక్క జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించామని చంద్రబాబు తెలిపారు.
ఇవి కూడా చదవండి