Chennai: చెన్నైలో షాకింగ్ ఘటన.. ఆన్‌లైన్‌ రమ్మీ ఆడే వాళ్లు ప్లీజ్ ఒక్కసారి..

ABN , First Publish Date - 2022-05-03T20:34:52+05:30 IST

పేకాట ఇప్పుడు Online Rummyగా చలామణీ అవుతోంది. ఈ రమ్మీ మోజులో పడి కొందరు బంగారం లాంటి జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. Chennaiలో..

Chennai: చెన్నైలో షాకింగ్ ఘటన.. ఆన్‌లైన్‌ రమ్మీ ఆడే వాళ్లు ప్లీజ్ ఒక్కసారి..

చెన్నై: పేకాట ఇప్పుడు Online Rummyగా చలామణీ అవుతోంది. ఈ రమ్మీ మోజులో పడి కొందరు బంగారం లాంటి జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. Chennaiలో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. ఓ కుటుంబంలో విషాదం నింపింది. చెన్నైలోని పోరూర్ ప్రాంతానికి చెందిన ప్రభు శ్రీపెరంబుదూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడు.



Corona సృష్టించిన సంక్షోభం కారణంగా ఆ సమయంలో ప్రభు ఉద్యోగం కోల్పోయాడు. అప్పటి నుంచి అతను ఇంట్లోనే ఉంటున్నాడు. వేరే ఉద్యోగం వెతుక్కోవడం మానేసి ఇంటి వద్దే ఖాళీగా కూర్చుని మద్యానికి బానిసగా మారాడు. మద్యానికి బానిసైన ప్రభు తాగొచ్చి నిత్యం భార్య జననితో గొడవలు పడుతూ ఆమెను ఇబ్బందిపెట్టసాగాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన జనని గత శుక్రవారం ఉదయం బిడ్డను తీసుకుని దగ్గర్లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. బంధువులు నచ్చజెప్పడంతో తిరిగి అదే రోజు రాత్రి ఇంటికొచ్చింది. ఇంటి తలుపు లోపల వైపు లాక్ చేసి ఉండటంతో జనని కంగారుపడింది. ఎన్నిసార్లు తలుపు కొట్టి పిలుస్తున్నా భర్త నుంచి స్పందన లేకపోవడంతో అనుమానమొచ్చి కిటికీ తెరిచి చూసింది.



సీలింగ్ ఫ్యాన్‌కు భర్త ఉరేసుకుని కనిపించడంతో షాకైన ఆమె కేకలు వేసింది. ఇరుగుపొరుగు వారు వచ్చారు. పోలీసులకు సమాచారం అందించారు. పోరూర్ పోలీసులు ఆ ఇంటికి చేరుకుని తలుపు బద్ధలు కొట్టి ప్రభును కిందకు దించారు. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. ప్రభు ఆత్మహత్య కేసును విచారించిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. జాబ్ కోల్పోయిన ప్రభు ఆన్‌లైన్ రమ్మీకి అలవాటు పడ్డాడు. ఉద్యోగం కోల్పోయానని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని చెప్పడంతో ప్రభు తండ్రి అతనికి రూ.20 లక్షలిచ్చాడు. ఆ డబ్బును ఆన్‌లైన్ రమ్మీ ఆడి పోగొట్టుకున్నాడు. ప్రభు అంతటితో ఆగలేదు. మరో రూ.15 లక్షలు Credit Cards వాడి ఆ డబ్బును కూడా ఈ పేకాట ఆడి కోల్పోయాడు. ఇలా మొత్తం రూ.35 లక్షలు Online Rummy ఆడి పోగొట్టుకుని ప్రభు నైరాశ్యంలో కూరుకుపోయాడు. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడు అతని భార్య, బిడ్డ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Read more