వంటలు

చాక్లెట్‌ రవ్వలడ్డు

చాక్లెట్‌ రవ్వలడ్డు

కావలసిన పదార్థాలు: రవ్వ- ఒకటిన్నర కప్పు, నెయ్యి- పావు కప్పు, కొకొ పౌడర్‌- రెండు స్పూన్లు, చక్కెర - అర కప్పు, బాదం పౌడర్‌- పావు కప్పు, యాలకుల పొడి- అర స్పూను, ఎండు ద్రాక్ష- పావు కప్పు, ఎండు కొబ్బరి- పావు కప్పు, జీడిపప్పు- పావు కప్పు.


తయారుచేసే విధానం: ముందుగా చిన్న పాన్‌లో స్పూను నెయ్యి వేసి జీడిపప్పును దోరగా వేయించాలి. తరవాత ద్రాక్షనూ కలిపి ఓ నిమిషం వేయించి పక్కన పెట్టాలి. పెద్ద పాన్‌లో పావు కప్పు నెయ్యి వేసి అందులో రవ్వను వేయించాలి. సన్నని మంట మీద బంగారు రంగు వచ్చే వరకు వేయిస్తూనే ఉండాలి. ఆ తరవాత బాదం పౌడర్‌, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, చక్కెర జతచేయాలి. చల్లారాక కొకొ పొడి కూడా వేసి బాగా కలిపి లడ్డూలు చుడితే సరి.

Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.