కార్పొరేట్లకు ప్రభుత్వాల దాసోహం

ABN , First Publish Date - 2022-05-15T05:21:36+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందలాది ఎకరాలను కార్పొరేట్‌ కంపెనీలకు రైతుల నుంచి బలవంతంగా లాక్కుని కార్పొరేట్లకు దాసోహమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. స్థానిక సీపీఎం కార్యాలయ భవన నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు.

కార్పొరేట్లకు ప్రభుత్వాల దాసోహం
శంకుస్థాపనకు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న సీపీఎం నాయకులు

సీపీఎం  రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
టెక్కలి:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందలాది ఎకరాలను కార్పొరేట్‌ కంపెనీలకు రైతుల నుంచి బలవంతంగా లాక్కుని కార్పొరేట్లకు దాసోహమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. స్థానిక సీపీఎం కార్యాలయ భవన నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాడు భూముల కోసం పోరాడేవారమని, నేడు ఆ భూములను రక్షించుకునేందుకు పోరాటాలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. పథకం ప్రకారం పాలకులు వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని సృష్టిస్తున్నారన్నారు. నాడు గిరిజన, రైతాంగ, కార్మికుల పోరాటాలకు కృష్ణమూర్తి ముందుండి నడిపించారని గుర్తుచేశారు. ఆయన పేరు తో భవన నిర్మాణం చేపడుతుండడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బెండి తులసీ దాస్‌, సీహెచ్‌ నర్సింగరావు, బవిరి కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి గోవిందరావు, నాయకులు కోనారి మోహనరావు, పోలాకి ప్రసాద్‌, నంబూరు షణ్ముఖరావు, కొల్లి ఎల్లయ్య, పినకాన కుటుంబ సభ్యులు పినకాన అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.
 

Read more