ముగిసిన Mumbai బ్యాటింగ్.. టైటాన్స్ ఎదుట భారీ లక్ష్యం

Published: Fri, 06 May 2022 21:32:48 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ముగిసిన Mumbai బ్యాటింగ్.. టైటాన్స్ ఎదుట భారీ లక్ష్యం

ముంబై: గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు సాధించి ప్రత్యర్థికి సవాలు విసిరింది. బలమైన బ్యాటింగ్ లైనప్  కలిగిన గుజరాత్‌ను ముంబై బౌలర్లు ఏమేరకు అడ్డుకుంటారనే దానిపై ముంబై విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబైకి మంచి ఆరంభం లభించింది. 


ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ జోడి తొలి వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యం అందించింది. Ishan Kishan 29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 45 పరుగులు చేయగా, చాలా రోజుల తర్వాత Rohit Sharma బ్యాట్ ఝళిపించాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఉన్నంత వరకు భారీ స్కోరు దిశగా ముంబై పరుగులు తీసింది.


74 పరుగుల వద్ద రోహిత్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 13 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే ఇషాన్ కూడా అవుటవడంతో పరుగుల వేగం మందగించింది. తిలక్ వర్మ 21, కీరన్ పొలార్డ్ 4 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యారు.


అయితే, చివర్లో టిమ్ డేవిడ్ చెలరేగడంతో ముంబై భారీ స్కోరు దిశగా మళ్లీ పరుగులు తీసింది. 21 బంతులు ఎదుర్కొన్న టిమ్ 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగులు పిండుకున్నాడు. చివరి బంతిని సిక్స్ కొట్టి స్కోరును 177 పరుగులకు చేర్చాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్‌కు రెండు, జోసెఫ్, ఫెర్గ్యూసన్, ప్రదీప్ సంగ్వాన్‌కు చెరో వికెట్ దక్కింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.