నెలాఖరులోగా ధాన్యం కొనుగోలు పూర్తి కావాలి

ABN , First Publish Date - 2022-05-12T06:57:36+05:30 IST

జిల్లాలో మే 31లోగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదే శించారు.

నెలాఖరులోగా ధాన్యం కొనుగోలు పూర్తి కావాలి
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అల్లోల

నిర్మల్‌ అర్బన్‌, మే 11 : జిల్లాలో మే 31లోగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదే శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌భవన్‌లో రైస్‌మిల్లర్లు, అధికారులు, ట్రాన్స్‌పోర్టు యంత్రాంగంతో పాటు వరికొనుగోలు ప్రత్యేక అధి కారులతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. 2021-22 సంవత్సరానికి గాను ధాన్యం కొనుగోలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యాసంగిసీజన్‌కు సంబంధించిన ధాన్యం కొను గోలును పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఒక లక్షా 30 వేల మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా కాగా జిల్లాలోని పది బాయిల్డ్‌ రైస్‌మిల్లులు, 33 రైస్‌మిల్లులు ఉన్నాయని, 135 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే 86 కేంద్రాలను ప్రారంభించి ఏడు వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి చేశామన్నారు. వర్షాలు పడే సూచ నలు కనబడుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి ధాన్యం తడిసి పోకుండా చర్యలు తీసుకోవాలని, రైతులకు నష్టం జరగకుండా జాగ్రత్త పడా లని, వీలైనంత తొందరగా కొనుగోలు చేయడం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ట్రాన్స్‌పోర్టు హమాలీల కొరత లేకుండా చూడాలని సూచించారు. ధాన్యం అమ్ముకున్న రైతులకు వారం రోజులలోగా డబ్బులు అందేలా చూడాలన్నారు. అధికారులు రోజూఫీల్డ్‌లో ఉండి తమ పరిధిలో ఉన్న ధాన్యంకల్లాల్లో వందశాతం కొనుగోలు పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ మాట్లాడుతూ... ధాన్యం కొనుగోళ్లను ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కొన్ని మండలాల్లో హార్వెస్ట్‌ పూర్తయిందని, తేమశాతం ఏమైనా మార్పులు వస్తే వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు తలెత్త కుండా అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడం కోసం కంట్రోల్‌ రూమ్‌  నుండి రోజు మానిటర్‌ చేస్తామన్నారు. ఈ సమావేశంలో ముధోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి, అదనపు కలెక్టర్లు హేమంత్‌ బోర్కడే, రాంబాబు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాజయ్య, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రఘునందన్‌, రైతు సమన్వయ చైర్మన్‌ వెంకట్‌రామ్‌రెడ్డి, జిల్లా మేనేజర్‌ చంద్రకళ, రైస్‌మిల్లర్లు, తహసీల్దార్‌, ఎంపీపీ రామేశ్వర్‌ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Read more