అందాన్ని కాపాడుకోవడానికి ఇలా చేయండి!

Published: Thu, 05 May 2022 14:25:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అందాన్ని కాపాడుకోవడానికి ఇలా చేయండి!

ఆంధ్రజ్యోతి(05-05-2022)

గ్రీన్‌ లేదా బ్లాక్‌ ఎలాంటి టీ బ్యాక్‌ అయినా కళ్ల వాపులు, మంటలను తగ్గిస్తుంది. టీలో ఉండే యాంటీ ఇరిటెంట్‌ గుణాలు కళ్ల చుట్టూ ఉండే వాపును తగ్గిస్తాయి. అయితే ఈ ఫలితాన్ని పొందాలంటే టీ బ్యాగ్‌లను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి.


వాడేసిన 2 టీ బ్యాగులను 30 నిమిషాలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత వీటిని ఫ్రిజ్‌ నుంచి బయటకు తీసి, వెల్లకిలా పడుకుని మూసిన కళ్ల మీద ఉంచుకోవాలి. ఈ టీ బ్యాగులు కళ్లను పూర్తిగా కప్పేలా చూసుకోవాలి. అలా 10 నిమిషాలపాటు టీ బ్యాగులను కళ్ల మీద ఉంచుకుని తీసేయాలి. ఇలా వారానికోసారి చేస్తే కళ్ల మంటలు తగ్గుతాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.