
అహ్మదాబాద్: గుజరాత్ ప్రభుత్వాన్ని పనికిమాలిన ప్రభుత్వం అంటూ అదే రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ MLA Jignesh Mevani తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సొంత రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేను Assam Police కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే Gujarat Government చూస్తూ కూర్చుందని ఆయన విమర్శించారు. రెండు సార్లు అరెస్టైన అనంతరం bail పొంది గుజరాత్ తిరిగి వచ్చిన ఆయన.. మంగళవారం Ahmedabadలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వానికి జిగ్నేష్ హెచ్చరికలు చేశారు. దళితులపై పెట్టిన కేసులు ఉపసంహరించకపోతే june 1న గుజరాత్ బంధ్ నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. 2016 july ఉనాలో గోవులను కళేబాలకు తరలిస్తున్నారని కొంత మంది దళిత యువకులను కట్టేసి కొట్టిన ఉదంతం తెలిసిందే. అనంతరం వారిపై స్థానిక పోలీసులు కేసులు పెట్టారు. ఈ కేసులను ఉపసంహరించుకోవాలని జిగ్నేష్ డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘నేను గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. ఈ ప్రభుత్వం నిజంగా పనికిమాలింది. ఎందుకంటే, అస్సాం పోలీసులు గుజరాత్ వచ్చి ఇక్కడి ఎమ్మెల్యేను సులభంగా kidnap చేసి తీసుకెళ్లారు. కానీ ఈ ప్రభుత్వం చూస్తూ కూర్చోవడం తప్ప ఏమీ చేయలేదు. ఇందుకు సిగ్గు పడాలి. అస్సాం పోలీసులు గుజరాత్ వచ్చి గుజరాత్ ఎమ్మెల్యేను కిడ్నాప్ చేయడం.. 6.5 కోట్ల గుజరాతీలకు తీవ్రమైన అవమానం’’ అని జిగ్నేష్ అన్నారు. అంతే కాకుండా అస్సాం ప్రభుత్వంపై కూడా జిగ్నేష్ మండిపడ్డారు. కోర్టు తనకు బెయిల్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం క్షమాపణ కోరడం లేదని ఆయన దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి