
Guntur: దుగ్గిరాల MPP YCP అభ్యర్థిగా రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఎంపీపీ పదవికి పార్టీల తరఫున ఒకే ఒక్క బిఫామ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. నాటకీయ పరిణామాల మధ్య రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. రూపవాణి ఎన్నికను అధికారులు ప్రకటించారు. ఎంపీపీ పద్మావతి ఆచూకీ ఇంకా తెలియలేదు.
MANGALAGIRI వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తీరుపై ఎంపీటీసీ పద్మావతి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుగ్గిరాల-2 ఎంపీటీసీ పద్మావతిని ఎమ్మెల్యే ఆర్కే తన వెంట తీసుకెళ్లాడని ఆమె కొడుకు యుగంధర్ బుధవారం ఆరోపించారు. తమ కుటుంబాన్ని వైసీపీ మానసికంగా వేధిస్తోందని వైసీపీ ఎంపీటీసీ పద్మావతి కొడుకు మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి