Chittoor జిల్లాలో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-05-04T00:37:36+05:30 IST

జిల్లాలో Heavy rain పడుతోంది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Chittoor  జిల్లాలో భారీ వర్షం

చిత్తూరు:  జిల్లాలో భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈదురు గాలులకు మామిడి కాయలు నేలరాలాయి. పలుచోట్ల  చెట్లు నేల కూలాయి. ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గంగాధర నెల్లూరు, యాదమరి మండలాల్లో కొబ్బరి చెట్లపై  పిడుగులు పడ్డాయి. పిడుగుల ధాటికి కొబ్బరి చెట్లు అంటుకున్నాయి.గంగాధర నెల్లూరు గ్రామ సచివాలయం ఆవరణలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది.యాదమరి మండలం పీసీ కండ్రిగలో కొబ్బరి చెట్టు పిడుగుపాటుకు దగ్ధమైంది.

Read more