హైదరాబాద్‌లో భారీ వర్షం.. కూలిన హోర్డింగ్స్

ABN , First Publish Date - 2022-05-04T13:36:46+05:30 IST

భాగ్యనగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో పలు ప్రాంతాల్లో హోర్డింగ్స్ కూలాయి.

హైదరాబాద్‌లో భారీ వర్షం.. కూలిన హోర్డింగ్స్

హైదరాబాద్: భాగ్యనగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో పలు ప్రాంతాల్లో హోర్డింగ్స్ కూలాయి. చార్మినార్, మలక్‌పేట్, బహదూర్‌పురా, చాదర్‌ఘాట్‌లో హోర్డింగ్స్ నేలకొరిగాయి.  భారీ వర్షం కారణంగా ఎక్కడికక్కడ రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైన డీఆర్‌ఎఫ్ బృందాలు... మోటార్ల సహాయంతో వర్షపు నీటిని తొలగిస్తున్నారు. నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో 19 జీహెచ్ఎంసీ డిజాస్టర్ బృందాలను బల్దియా అప్రమత్తం చేసింది. 

Read more