Vijayanagaram Districtపై ‘ఆసాని’ తుపాను ప్రభావం

ABN , First Publish Date - 2022-05-09T23:04:03+05:30 IST

విజయనగరం జిల్లాపై ఆసాని తుపాను ప్రభావం చూపుతోంది. జిల్లా అంతటా భారీ ఈదురు గాలుల బీభత్సం సృష్టిస్తున్నాయి.

Vijayanagaram Districtపై ‘ఆసాని’ తుపాను ప్రభావం

విజయనగరం: విజయనగరం జిల్లాపై ఆసాని తుపాను ప్రభావం చూపుతోంది. జిల్లా అంతటా భారీ ఈదురు గాలుల బీభత్సం సృష్టిస్తున్నాయి. తుఫాన్‌ హెచ్చరిక దృష్ట్యా జిల్లాలోని మత్స్యకారులు ఎవరూ వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న వారు వెంటనే తీరానికి తిరిగి వచ్చేలా మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తు నిర్వహణ సమన్వయశాఖల అధికారులందరూ వాతావరణశాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు. అకాల వర్ష సూచన దృష్ట్యా పొలాల్లోను, కుప్పల్లోను, ఉన్న ధాన్యం, పాడవకుండా రైతులు జాగ్రత్తలు పాటించేలా సూచనలు అందించాలని వ్యవసాయశాఖను ఆదేశించారు. పెనుగాలులవల్ల చెట్లు కూలి రహదారి రవాణాకు, విద్యుత్‌ సరఫరాకు అంతరాయాలు ఎదురైతే వెంటనే పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉండాలని రోడ్లు భవనాలు, ట్రాన్స్‌కో అధికారులకు కలెక్టర్ సూచించారు. 

Read more