
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అద్వాన రహదారులపై జరుగుతున్న ప్రమాదాలతో పల్లె కన్నీరు పెడుతోందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జాతీయ రహదారుల అనంతరం రాష్ట్ర రహదారులలో ప్రయాణం నరకప్రాయంగా మారిందని విమర్శించారు. ఒక మోస్తరు పట్టణాల నుంచి గ్రామాల వరకు రహదారులపైన ప్రయాణం ప్రజలకు ప్రాణసంకటంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నాసిరకపు రహదారుల నిర్వహణవల్ల అర్దోపెడిక్, న్యూరో ట్రామా ఆస్పత్రులలో సగటున కేసులు బాగా పెరిగిపోయాయన్నారు. 25 జిల్లాల్లో 166.6 కి.మీ. పరిశీలిస్తే 6,220 గుంతలు బయటపడ్డాయని అంటే రాష్ట్రంలో జగనన్న రహదారుల గుంతల పథకం పెట్టినట్లుందని లంకా దినకర్ ఎద్దేవా చేశారు.