రైల్వే స్టేషన్‌కు దగ్గరలో కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో ఆర్మీ జవాన్.. పోలీసుల ప్రశ్నలతో టెన్షన్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

ABN , First Publish Date - 2022-05-06T17:11:18+05:30 IST

అతను ఆర్మీ సైనికుడు.. తన సహచరులతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నాడు.. హఠాత్తుగా ఉన్నట్టుండి మార్గ మధ్యంలో అదృశ్యమయ్యాడు..

రైల్వే స్టేషన్‌కు దగ్గరలో కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో ఆర్మీ జవాన్.. పోలీసుల ప్రశ్నలతో టెన్షన్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

అతను ఆర్మీ సైనికుడు.. తన సహచరులతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నాడు.. హఠాత్తుగా ఉన్నట్టుండి మార్గ మధ్యంలో అదృశ్యమయ్యాడు.. సహచరులు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది.. దీంతో వారు సమీపంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు చేశారు.. రెండ్రోజుల తర్వాత ఓ రైల్వే స్టేషన్‌లో కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో ఆ ఆర్మీ జవాన్ కనిపించాడు.. పోలీసులు అతడిని విడిపించి విచారించారు.. ఒకదానికొకటి పొంతన లేని సమాధానాలు చెప్పాడు.. పోలీసులు గట్టిగా అడగడంతో అసలు విషయం బయటపెట్టాడు. 


నితిన్ చౌహాన్ అనే ఆర్మీ సైనికుడు విధుల్లో భాగంగా తన సహచర సైనికులతో కలిసి గత నెల 24న జైపూర్ నుంచి జైసల్మేర్ వెళ్తున్నాడు. రైలు దేగానా రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత నితిన్ అదృశ్యమయ్యాడు. ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. దీంతో తోటి సైనికులు సమీపంలోని అన్ని పోలీస్ స్టేషన్‌లకు సమాచారం అందించారు. రెండ్రోజుల తర్వాత అల్వార్ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న ఓ రైలులో నితిన్ చేతులు, కాళ్లు కట్టి ఉన్న స్థితిలో పోలీసులకు దొరికాడు. అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా.. తను దోపిడీకి గురయ్యానని చెప్పాడు. 


విచారణలో మాటి మాటికి కథ మార్చడం మొదలుపెట్టాడు. దీంతో పోలీసులు అతడిని కఠినంగా విచారించారు. దాంతో నితిన్ అసలు విషయం బయటపెట్టాడు. ఏప్రిల్ 24 రాత్రి తాను రైలు దిగి తన స్నేహితురాలిని కలవడానికి టోంక్‌కు వెళ్లానని చెప్పాడు. టోంక్‌లో ఆమెతో రోజంతా సరదాగా గడిపాడు. అయితే ఆర్మీ అధికారులు విధించే శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఈ నాటకం ఆడినట్టు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నితిన్‌ను ఆర్మీ అధికారులకు అప్పగించారు. 

Read more