నిజాయతీగా పనిచేసే పోలీస్ అధికారిని బలి తీసుకున్నారు: Lokesh

ABN , First Publish Date - 2022-05-13T22:31:07+05:30 IST

నిజాయతీగా పనిచేసే పోలీస్ అధికారిని బలి తీసుకున్నారని టీడీపీ నేత లోకేష్‌ (Lokesh) విమర్శించారు.

నిజాయతీగా పనిచేసే పోలీస్ అధికారిని బలి తీసుకున్నారు: Lokesh

అమరావతి: నిజాయతీగా పనిచేసే పోలీస్ అధికారిని బలి తీసుకున్నారని టీడీపీ నేత లోకేష్‌ (Lokesh) విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కక్షసాధింపు చర్యల వల్లే సర్పవరం ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఎస్ఐ గోపాలకృష్ణ మృతిపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలి, ఎస్ఐ కుటుంబాన్ని ఆదుకోవాలని లోకేష్‌ డిమాండ్ చేశారు.


గోపాలకృష్ణ (Gopalakrishna) పిస్టల్‌తో కాల్చుకుని ఎస్‌ఐ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రభుత్వం, జిల్లా ఎస్పీ వేధింపుల వల్ల గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పోస్టింగ్ ఇవ్వకుండా అధికారులు వేధింపులకు గురిచేశారు. ట్రైనింగ్ పూర్తయ్యాక కొన్నాళ్ళు ట్రాఫిక్ విభాగంలో గోపాలకృష్ణ విధులు నిర్వహించాడు. ఆ తర్వాత స్టేషన్ బాధ్యతలు ఇవ్వకుండా సర్పవరం సర్కిల్లో పోస్టింగ్ వేశారు. అధికారుల తీరుపై కొన్నాళ్లుగా ఎస్‌ఐ గోపాలకృష్ణ మనస్తాపంతో బాధపడుతున్నాడు.  తాజాగా పోలీస్ బాస్ వేధింపులు అధికంకావడంతో ఈ అఘాయిత్యానికి ఎస్‌ఐ పాల్పడినట్లు తెలుస్తోంది. 

Read more