మేకకూ ఓ మనసుంటుంది.. ఘనంగా బర్త్‌డే వేడుక నిర్వహించిన కన్నడ వ్యక్తి!

ABN , First Publish Date - 2022-05-04T20:45:22+05:30 IST

ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులను తమ కుటుంబ సభ్యుల్లా భావించేవారిని చాలా మందిని చూస్తుంటాం.

మేకకూ ఓ మనసుంటుంది.. ఘనంగా బర్త్‌డే వేడుక నిర్వహించిన కన్నడ వ్యక్తి!

సాధారణంగా మేకలను మాంసం కోసమే పెంచుతుంటారు. ఎంతటి మేకైనా సరే ఎప్పుడోకప్పుడు అది మటన్ ముక్కగా ఎవరో ఒకరి ప్లేట్‌లోకి వెళ్లాల్సిందే. అలాంటి మేకను ఓ కుటుంబం అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. తాజాగా పుట్టిన రోజు వేడుకలు కూడా నిర్వహించింది. మేకను కూడా తమ కుటుంబంలో ఓ సభ్యుడిగా భావించిన ఓ వ్యక్తి దాని పుట్టిన రోజును ఘనంగా నిర్వహించాడు. 


కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా గొల్లారహట్టి గ్రామానికి చెందిన క్రిష్ణమూర్తి అనే వ్యక్తి వద్ద ఓ మేక పిల్ల ఉంది. దాని పేరు కాప్రి. ఆ మేకంటే అతడికి ఎంతో ఇష్టం. గత ఏడాది మే 2న కాప్రి పుట్టింది. ఆ తర్వాత కొన్ని రోజులకే దాని తల్లి మరణించింది. దాంతో కాప్రిని కృ‌ష్ణమూర్తి దంపతులు ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించారు. దానికి రోజూ పాలతో పాటు ఇడ్లీ, దోశె కూడా పెట్టేవారు. గతేడాది కాప్రి అనారోగ్యం పాలైనపుడు కృష్ణమూర్తి, మంజుల తల్లడిల్లిపోయారు. కాప్రిని ప్రతి రోజూ ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ చేయించి కోలుకునేలా చేశారు. 


కాప్రి జన్మించి ఏడాది గడిచిపోవడంతో దానికి కృ‌ష్ణమూర్తి దంపతులు సోమవారం బంధుమిత్రుల మధ్య ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఆ మేక చేత 5 కేజీల కేక్ కట్ చేయించారు. బర్త్ వేడుకకు వచ్చిన వారు కాప్రికి కానుకలు కూడా ఇచ్చారు. కొందరు డబ్బులను చదివించి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Read more