హామీల అమలుకు ప్రాధాన్యం: Minister Nazar

ABN , First Publish Date - 2022-05-14T15:13:26+05:30 IST

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ముఖ్యమంత్రి స్టాలిన్‌ చర్యలు చేపట్టారని పాడి పరిశ్రమల శాఖ మంత్రి ఆవడి నాజర్‌ అన్నారు. డీఎంకే ఏడాది పాలనలో

హామీల అమలుకు ప్రాధాన్యం: Minister Nazar

గుమ్మిడిపూండి(చెన్నై): ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ముఖ్యమంత్రి స్టాలిన్‌ చర్యలు చేపట్టారని పాడి పరిశ్రమల శాఖ మంత్రి ఆవడి నాజర్‌ అన్నారు. డీఎంకే ఏడాది పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేసేలా పట్టణంలో గురువారం రాత్రి బహిరంగ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే గోవిందరాజన్‌ అధ్యక్షత వహించిన సభలో మంత్రి నాజర్‌ పాల్గొని, ఏడాదిలో అమలుచేసిన పథకాలు, రాష్ట్రాభివృద్ధికి చేపట్టిన చర్యలు వివరించారు. సభలో జిల్లా చైర్మన్‌ ఉమామహేశ్వరి, పొన్నేరి పట్టణ పంచాయతీ అధ్యక్షుడు పరిమళ విశ్వనాథన్‌, యూనియన్‌ కార్యదర్శి కేవీ ఆనందకుమార్‌, మణిబాలన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more