జాతీయ స్థాయిలో మెరిసిన ఆదివాసీ గ్రామాలు

ABN , First Publish Date - 2022-05-13T05:08:37+05:30 IST

అది ఆదివాసి గ్రామమే కానీ అన్ని రకాల అభివృద్ధి సూచికల్లో జాతీయ స్థాయిలోనే తన సత్తాచాటి మైదాన ప్రాంత గ్రామాలకు సవాలుగా నిలిచింది. ఆ ఊర్లో చారిత్రాత్మక ఘటనలు ఎన్నో జరిగాయి. సామాజిక శాస్త్రవేత్త హైమన్‌డార్ఫ్‌ మొదలుకొని కనకరాజు వరకు అంతా ఆ ఊరి వారే. అదే ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సంసద్‌ ఆదర్శ గ్రామీణ్‌ యోజన కార్యక్రమంలో భాగంగా పార్లమెంటర్ల నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకొని అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.

జాతీయ స్థాయిలో మెరిసిన ఆదివాసీ గ్రామాలు
మార్గవాయి గ్రామం

సంసద్‌ ఆదర్శ గ్రామీణ్‌ యోజనలో జిల్లా టాప్‌

జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన మార్లవాయి 

నాల్గవ స్థానంలో మహగాం

మానవాభివృద్ధి సూచిలో మెరుగైన ఫలితాలు

అధికారుల కృషితో ఐకమత్యంగా గ్రామస్థులు 

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

అది ఆదివాసి గ్రామమే కానీ అన్ని రకాల అభివృద్ధి సూచికల్లో జాతీయ స్థాయిలోనే తన సత్తాచాటి మైదాన ప్రాంత గ్రామాలకు సవాలుగా నిలిచింది. ఆ ఊర్లో చారిత్రాత్మక ఘటనలు ఎన్నో జరిగాయి. సామాజిక శాస్త్రవేత్త హైమన్‌డార్ఫ్‌ మొదలుకొని కనకరాజు వరకు అంతా ఆ ఊరి వారే. అదే ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సంసద్‌ ఆదర్శ గ్రామీణ్‌ యోజన కార్యక్రమంలో భాగంగా పార్లమెంటర్ల నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకొని అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి రెండు గ్రామాలు ఎంపిక కాగా, ఆ రెండు గ్రామాలు కూడా ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందినవి కావటం మరో విశేషం. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘సాగీ’ ర్యాంకులలో మార్లవాయి, మహగాం గ్రామాలు జాతీయ స్థాయిలో మొదటి, నాలుగవ స్థానాల్లో నిలిచాయి. నాలుగు అంశాలతో ఈ ర్యాంకులను నిర్ణయిస్తున్నారు. ఇందులో ప్రధానంగా పర్సనల్‌ కేటగిరీలో వ్యక్తిగత విలువలు, వ్యక్తిగత శుభ్రత, సంస్కృతి, కళలు, సామాజిక మార్పు వంటి అంశాలు పరిగణలోకి తీసుకున్నారు. అలాగే హ్యుమన్‌ డెవలప్‌మెంటులో భాగంగా నిత్య సదుపాయాలు, వైద్యం, పోషకాహారం, సామాజిక భద్రత వంటి అంశాలున్నాయి. అలాగే ఎకనామిక్‌ డెవలప్‌మెంటు ఇండస్ట్రీస్‌లో భాగంగా జీవనోపాధి, నైపుణ్యా భివృద్ధి, ఆర్థిక చేకూర్పు, మౌలిక సదుపాయాల కల్పన, అలాగే సోషల్‌ ఇండెక్స్‌లో ప్రజల భాగస్వామ్యం, సామాజిక నైతికవిలువ, సామాజికన్యాయం, సుపరిపాలన వంటి నాలుగు అంశాల్లో అభివృద్ధిని కొలమానంగా తీసుకొని ఆదర్శ గ్రామాలకు ర్యాంకులను ప్రకటిస్తున్నారు. మార్లవాయి గ్రామంలో గతేడాదిగా గ్రామంలోని అన్ని వర్గాల ప్రజానీకాన్ని ఏకం చేసి వృత్తి నైపుణ్యం, కళలు, సాంస్కృతిక కార్యకలపాలు, పోషకాహార తయారీ వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి శిక్షణ ఇచ్చారు. అంతేకాదు సేంద్రియ పంటల సాగు, తాగునీటి నిర్వహణ వంటి అంశాల్లోనూ ఈ గ్రామం జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభను కనబరిచింది. నాగరిక ప్రపంచానికి ఏ మాత్రం తీసిపోని రీతిలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఙానాన్ని అంది పుచ్చుకుంటూ అన్ని రకాల అభివృద్ధి ఫలాలను సాధించే దిశగా ముందడుగు వేయడంపై అధికార వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మార్లవాయికి జాతీయ స్థాయిలో మొదటి స్థానం దక్కటం ఇది మొత్తంగా ఆదివాసీ ప్రజలకు గుర్తింపు లభింటచమేనన్నది చెప్పక తప్పదు. అలాగే జాతీయ స్థాయిలో నాలుగవ ర్యాంకు సాధించిన సిర్పూరు(యూ) మండలంలోని మహగాం గ్రామంలోనూ ఇదే తరహా అభివృద్ధి సూచికలు నమోదు కావటం వల్లే మెరుగైన ర్యాంకు సాధించిందని అధికారులు అంటున్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడ మానవభివృద్ధితో పాటు సాంస్కృతిక రంగాల్లోనూ అద్భుతమైన ప్రగతి నమోదు అయిందంటున్నారు. ఈ రెండు గ్రామాల్లోనూ ప్రజలు సమష్ఠిగా ముందుకు సాగుతుండటం వల్లే మెరుగైన ర్యాంకులు సాధ్యమైనట్టు ఆయా గ్రామస్థుల అభిప్రాయం. మౌలిక సదుపాయాల పరంగా గ్రామాల్లో ఉండాల్సిన వసతులను కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి ఖర్చు చేసి అభివృద్ధి చేశారు. లైబ్రరీ, సీసీ రోడ్లు, పంచాయతీ భవనం, సమావేశ మందిరం, మ్యూజియం వంటి వసతులను కల్పించారు. అలాగే మహిళలకు స్వయంఉపాధి కోసం కుట్టుశిక్షణ ఇప్పించి దుస్తుల తయారీని ప్రొత్సాహిస్తు న్నారు. త్వరలోనే వీరికి మొత్తం ఉమ్మడి జిల్లా పాఠశాల ఏకరూప దుస్తుల తయారీ అప్పగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

మద్యం ముట్టరు.. మాంసం తినరు..

సంసద్‌ ఆదర్మ గ్రామీణ్‌ యోజనలో జాతీయస్థాయిలో నాలుగవ ర్యాంకు సాధించిన మహగాం గ్రామానికి మరో ప్రత్యేకత ఉంది. ఈగ్రామంలో ఆదివాసీలు ఎవరూ కూడా ఎలాంటి దురలవాట్లు లేకుండా జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా మద్యపానం, ధూమపానం వంటి దురలవాట్లకు ఈ గ్రామం చాలా దూరంగా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ జీవహింస మహా పాపంగా భావిస్తారు. పూలాజీబాబా బోధనలకు ప్రభావితులై గ్రామస్థులు రెండు దశాబ్ధాల క్రితమే మద్యం, మాంసాన్ని పూర్తిగా త్యజించటం విశేషం. 

జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలవడం గర్వంగా ఉంది

-సురేందర్‌, డీఆర్డీవో, ఆసిఫాబాద్‌

జైనూరు మండలం మార్లవాయి గ్రామం జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం గర్వంగా ఉంది. ముఖ్యంగా మైదాన ప్రాంత గ్రామాలకు ధీటుగా ఓ ఆదివాసీ గ్రామం అందరినీ అధిగమించి మొదటి స్థానంలో నిలువడం అంటే మాటలు కాదు. ఇందుకు గ్రామస్థుల ఐక్యత, కృషి, పట్టుదలతో పాటు అన్ని శాఖలకు చెందిన అధికారుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. జిల్లాకు చెందిన రెండు గ్రామాలు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించడం ఈ జిల్లాకు తెచ్చిన ప్రత్యేక గుర్తింపుగా భావిస్తున్నాం. 

Read more