Nellore: 16ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తుల అఘాయిత్యం

ABN , First Publish Date - 2022-05-06T19:53:42+05:30 IST

జిల్లాలోని డక్కిలి మండల పరిధిలో దారుణం జరిగింది. 16ఏళ్ల బాలికపై అత్యాచార ఘటన మూడు నెలల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Nellore: 16ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తుల అఘాయిత్యం

నెల్లూరు: జిల్లాలోని డక్కిలి మండల పరిధిలో దారుణం జరిగింది. 16ఏళ్ల బాలికపై అత్యాచార ఘటన మూడు నెలల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  మండల పరిధిలోని ఓ గ్రామంలో 16 సంవత్సరాల బిసి మైనర్‌పై సుబ్బయ్య, భాస్కర్ అనే ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలికకు రెండు, మూడు నెలలుగా బహిష్టు కాకపోవడంతో తల్లిదండ్రులు పరీక్ష చేయించారు. ఈ క్రమంలో బాలిక గర్భవతి అని నిర్ధారణ కావడంతో ఐదురోజుల క్రితం అబార్షన్ చేయించారు. ఈ ఘటనపై డక్కిలి పోలీసుస్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫోక్సో యాక్ట్ క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

Read more