ప్రతీగ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-05-13T06:40:38+05:30 IST

ప్రతీగ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, పిచ్చి మొక్కలను తొలగించి రిజిస్టర్‌ను మెయింటెన్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ ము షారఫ్‌ ఫారూఖీ అన్నారు.

ప్రతీగ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలి : కలెక్టర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌, మే 12 : ప్రతీగ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, పిచ్చి మొక్కలను తొలగించి రిజిస్టర్‌ను మెయింటెన్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ ము షారఫ్‌ ఫారూఖీ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్‌ సమావేశ మందిరంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ స్కీమ్‌ కింద చేపట్టిన పనులపై కలెక్టర్‌ సంబంధిత అధి కారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ... నేషనల్‌ లెవెల్‌ మానిటరింగ్‌ కమిటీ ఈ నెల 16న రానున్న సంద ర్భంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణా ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులు, సీసీ రోడ్లు, పల్లె ప్రకృతివనాలు, డ్రాయింగ్‌ ప్లాట్‌ఫామ్‌, రైతువేదికలు, నర్సరీలు, డంపింగ్‌యార్డ్‌, తదితర పనుల డాక్యు మెంటరీ తయారు చేయాలని అన్నారు. ప్రతీగ్రామం పరిశుభ్రంగా ఉంచా లని, పిచ్చి మొక్కలు తొలగించాలని, ప్రతి రిజిస్టర్‌ మెయింటెన్‌ చేయాలని, రానున్న బృందం ఏ గ్రామానైనా సందర్శించవచ్చని, శానిటేషన్‌, మురికి కాలువలు, చెత్తా చెదారం లేకుండా శుభ్రంచాలని ఉంచాలని, అన్ని ఏర్పాట్ల తో సంసిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్‌డీవో విజయలక్ష్మి, సీఈవో సుధీర్‌, అధికారులు, తదితరులు పాల్గొన్నా రు. 

కరోనా సమయంలో నర్సుల సేవలు అనిర్వచనీయం

నిర్మల్‌ టౌన్‌, మే 12 : కరోనా సమయంలో నర్సుల సేవలు అనిర్వచనీ యమని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ కొనియాడారు. గురువారం అంత ర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా స్థానిక ఏరియా ఆసుపత్రిలో అంత ర్జాతీయ నర్సుల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ కేక్‌కట్‌ చేశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ... వైద్యరంగంలో కీలకమైన నర్సువృత్తికి గౌరవాన్ని, హుందా తనాన్ని తీసుకువచ్చిన ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ పుట్టినరోజు సందర్భంగా అంత ర్జాతీయ నర్సుల దినోత్సవంను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణలో కరోనా సమయంలో ఎనలేని సేవలను అందించిన ప్రతి ఒక్క నర్సులందరికీ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో ఎంసీహెచ్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ రజిని, సూపరెండెంట్‌ దేవేందర్‌ రెడ్డి, ఆర్‌ఎంవో వేణుగోపాల్‌, నర్సింగ్‌ సూపరెండెంట్‌ భారతి, హెడ్‌ నర్స్‌ శోభలత, తదితరులు పాల్గొన్నారు. 

ఈవీఎం గోదామును పరిశీలించిన కలెక్టర్‌

నిర్మల్‌టౌన్‌, మే 12 : నిర్మల్‌ జిల్లాలోని ఈవీఎం గోదామును గురువారం కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి నెల తనిఖీల్లో భాగంగానే గోదామును పరిశీలించినట్లు ఆయన తెలిపారు. గోదాము ప్రాంతంలో ఎలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని అధికారులకు సూచించారు. గోదాము నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ పి. రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు. 

Read more