AP News: విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షం

ABN , First Publish Date - 2022-05-12T00:15:59+05:30 IST

తుఫాన్‌ ప్రభావంతో విజయనగరం జిల్లా అంతటా బుధవారం వర్షం కురిసింది. ఉదయం నుంచి చిన్న పాటి చినుకులు...

AP News: విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షం

విజయనగరం: తుఫాన్‌ ప్రభావంతో విజయనగరం జిల్లా అంతటా బుధవారం వర్షం కురిసింది. ఉదయం నుంచి చిన్న పాటి చినుకులు... కొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షం పడింది. సముద్ర తీర మండలాలు భోగాపురం, పూసపాటిరేగలో మాత్రం భారీగా వర్షం కురిసింది. మత్స్యకారులు వేట సామగ్రిని భద్రపర్చుకునేందుకు ఏర్పాటు చేసుకున్న పూరిపాకలు గాలులకు ధ్వంసమయ్యాయి. కుమిలి, డెంకాడ ప్రాంతాల్లో మొక్కజొన్న పంటలు తడిసిపోయాయి. రబీలో వేసిన వరి చేలు కోసి మళ్లల్లోనే కుప్పలు వేశారు. వారంతా పంట నష్టంపై భయపడుతున్నారు. 

Read more