పల్లెప్రకృతి వనాలను అభివృద్ధి చేయాలి

ABN , First Publish Date - 2022-05-12T05:30:00+05:30 IST

ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలను మరింతగా అభివృద్ధి చేయాలని డివిజనల్‌ పంచాయతీ అధికారి భిక్షపతి గౌడ్‌ అన్నారు.

పల్లెప్రకృతి వనాలను అభివృద్ధి చేయాలి

ఉట్నూర్‌, మే 12: ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలను మరింతగా అభివృద్ధి చేయాలని డివిజనల్‌ పంచాయతీ అధికారి భిక్షపతి గౌడ్‌ అన్నారు. మండలంలోని ఘన్‌పూర్‌ పంచాయతీని సందర్శించి గురువారం పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ ప్రకృతి ద్వారా ఆహ్లాదాన్ని కల్పించడానికి ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలలో ఇంకా అందమైన మొక్కలను పెంచి ప్రతి రోజూ పిల్లలు, పెద్దలు ప్రకృతి వనానికి వచ్చి సేద తీరేలా కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీలలో నర్సరీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో నాటించిన హరితహారం మొక్కలు  చనిపోకుండా కాపాడాలని, ప్రతీ శుక్రవారం డ్రైడే పాటిస్తూ మొక్కలకు నీళ్లు పెట్టి బతికించాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీవో మహేష్‌కుమార్‌, సర్పంచ్‌ పంద్రలత, కార్యదర్శి పాల్గొన్నారు. 

Read more