Shiv Sena స్కూల్‌ది అసలు Hindutva: Sanjay Raut

ABN , First Publish Date - 2022-05-04T18:02:01+05:30 IST

బాలాసాహేబ్ చివరి రోజుల్లో ఆయనను వదిలేసిన వారు ఇప్పుడు ఆయన పేరును ఎందుకు తీస్తున్నారు? బాలాసాహేబ్, వీర్ సావర్కర్.. వీరిద్దరు మాత్రమే హిందుత్వ గురించి ఈ దేశానికి వివరించారు. మిగిలినవన్నీ నకిలీ హిందుత్వలు..

Shiv Sena స్కూల్‌ది అసలు Hindutva: Sanjay Raut

ముంబై: Maharashtra లో ఈరోజు ఎలాంటి నిరసనలు జరగడం లేదని, ఇదంతా ఒకరోజు డ్రామా అని Shiv Sena పార్టీ సీనియర్ నేత Sanjay Raut అన్నారు. ‘రాత్ గయీ.. బాత్ గయీ’ (చీకటైతో అన్నీ మర్చిపోతారు) రాష్ట్రంలో loudspeakers అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి MNS అధినేత Raj Thackeray ఇచ్చిన డెడ్‌లైన్ ఈరోజుతో పూర్తి కావస్తుండడంపై మీడియా ప్రశ్నించగా రౌత్ పై విధంగా స్పందించారు. Veer Savarkar, Balasaheb మాత్రమే హిందుత్వ గురించి చెప్పారని, శివసేన పాఠశాలలో చెప్పేది నిజమైన హిందుత్వ అని రౌత్ అన్నారు.


‘‘బాలాసాహేబ్ చివరి రోజుల్లో ఆయనను వదిలేసిన వారు ఇప్పుడు ఆయన పేరును ఎందుకు తీస్తున్నారు? బాలాసాహేబ్, వీర్ సావర్కర్.. వీరిద్దరు మాత్రమే హిందుత్వ గురించి ఈ దేశానికి వివరించారు. మిగిలినవన్నీ నకిలీ హిందుత్వలు’’ అని సంజయ్ రౌత్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఇక్కడ (మహారాష్ట్రలో) నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి లౌడ్‌స్పీకర్లు లేవు. రాష్ట్రంలో శాంతి నెలకొని ఉంది’’ అని అన్నారు.


దీనికి ముందు Bal Thackerayకు చెందిన ఒక వీడియోను Raj Thackeray తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రోడ్లపై నమాజ్‌ ఆగిపోతుంది. అభివృద్ధికి ఏ మతం అడ్డు కాకూడదు. హిందువుల ఆచార సంప్రదాయాలు అభివృద్ధికి అడ్డుగా ఉంటే ఆ మతాన్ని కూడా పరిశీలిస్తాం. అలాగే మసీదుల వద్ద లౌడ్‌స్పీకర్లు తొలగిస్తాం’’ అని ఆ వీడియోలో బాల్ థాకరే అన్నారు. ప్రస్తుతం ఈ వీడియోపై కూడా మహారాష్ట్రలో తీవ్ర చర్చ జరుగుతోంది.

Read more