కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-05-13T05:11:40+05:30 IST

వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ కుమ్రం మాంతయ్య అన్నారు. మండలంలోని రవీంద్ర నగర్‌-1 గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరికొనుగోలు కేంద్రాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి గురువారం ప్రారంభించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని రైతులు వినియో గించుకోవాలని అన్నారు. వరిధాన్యాన్ని మద్దతు ధరకు అమ్ముకోవాలన్నారు.

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
సిర్పూర్‌(టి)లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న అధికారులు

చింతలమానేపల్లి, మే 12: వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ కుమ్రం మాంతయ్య అన్నారు. మండలంలోని రవీంద్ర నగర్‌-1 గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరికొనుగోలు కేంద్రాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి గురువారం ప్రారంభించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని రైతులు వినియో గించుకోవాలని అన్నారు. వరిధాన్యాన్ని మద్దతు ధరకు అమ్ముకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ డుబ్బుల నానయ్య, జడ్పిటీసీ డుబ్బుల శ్రీదేవి, కోఆప్షన్‌ సభ్యుడు నాజీమ్‌ హుస్సేన్‌, సీఈవో రాజేష్‌, ఏవో రాజేష్‌ ఏఈశో శ్వేత, నాయకులు మాధవ్‌, సురేష్‌, సెంటర్‌ ఇన్‌చార్జీ అమీర్‌ హుస్సేన్‌ తదితరులు ఉన్నారు.

సిర్పూర్‌(టి)లో..

సిర్పూరు(టి): రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వి నియోగం చేసుకోవాలని మండల విస్తరణ అధికారి డి కవిత అన్నారు. గురువారం సిర్పూరు(టి) సహకార సంఘం సొసైటీలో యాసంగి వండ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యం దళారులకు అమ్మ కుండా నేరుగా సోసైటీలో విక్రయిస్తే క్వింటాలుకు రూ.1960వరకు మద్దతు ధర లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్‌ జిల్లా సహకార సంఘం మేనేజర్‌ జ్యోతి, సిర్పూరు(టి) సహకార సంఘం సీఈవో రాకేష్‌, సూపర్‌వైజర్‌ అనిల్‌, సిబ్బంది సురేష్‌, తదితరులు పాల్గొన్నారు. లోన్‌వెల్లి గ్రామంలో కూడా వరికొనుగోలుకేంద్రాన్ని ప్రారంభించారు.

Read more