తెలంగాణలో ప్రారంభమైన Inter Exams

ABN , First Publish Date - 2022-05-06T15:23:13+05:30 IST

తెలంగాణలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈనెల 24 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,443 ఇంటర్ పరీక్ష కేంద్రాలను

తెలంగాణలో ప్రారంభమైన Inter Exams

హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈనెల 24 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,443 ఇంటర్ పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. రాష్ట్రవ్యాప్తంగా 1443 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా అన్ని గ్రూపులకు చెందిన ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 9.07 లక్షల మంది హాజరుకానున్నారు. 150 మంది సిట్టింగ్‌ స్క్వాడ్‌లు, 75 మంది ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు.  పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించొద్దని నిర్ణయించారు. విద్యార్థుల ఓఎంఆర్‌ షీట్లలో తప్పులు దొర్లితే అక్కడికక్కడే సరిచేసి ఇవ్వనున్నారు. అన్ని కేంద్రాల్లో విద్యుత్తు, మంచినీటి సదుపాయాలు ఉంటాయి. అత్యవసర వైద్య సేవల కోసం ఆశావర్కర్లు, ఏఎన్‌ఎం సిబ్బంది అందుబాటులో ఉంటారు.

Read more