Parvathipuram manyamలో ఘోర ప్రమాదం.. తెగిపడిన మహిళ చేయి

Published: Sat, 14 May 2022 17:14:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Parvathipuram manyamలో ఘోర ప్రమాదం.. తెగిపడిన మహిళ చేయి

పార్వతీపురం: పార్వతీపురం మన్యం (Parvathipuram manyam district) జిల్లాలోని వీరఘట్టాంలో విషాదం చోటు చేసుకుంది. బస్సులో అజాగ్రత్తగా ప్రయాణిస్తున్న మహిళకు జీవితంలో కోలుకో లేని దెబ్బ తగిలింది. పేలూరి పైడితల్లి అనే మహిళ బస్సులో కూర్చొని చేయి బయటపెట్టడంతో బస్సు పక్క నుంచి వెళుతున్న ఆటో ఢీకొని మహిళ చేయి తెగిపడింది. ఈ ఘటనతో తోటి ప్రయాణీకులు హడలెత్తిపోయారు. చికిత్స నిమిత్తం బాధితురాలిని పాలకొండ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో వీరఘట్టాంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.