భర్తకు పాలల్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి పెళ్లైన మూడో రోజే ఇంట్లోంచి ఎస్కేప్.. మర్నాడే భార్య వీడియో కాల్ చేసి..

Published: Sat, 14 May 2022 19:04:42 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భర్తకు పాలల్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి పెళ్లైన మూడో రోజే ఇంట్లోంచి ఎస్కేప్.. మర్నాడే భార్య వీడియో కాల్ చేసి..

పెళ్లిలో సంతోషంగా కనిపించే వధూవరులు.. జీవితాంతం అలాగే ఉండాలని ఇరువైపు కుటుంబాల వారు కోరుకుంటారు. కూతురు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో అడిగినంత కట్నం ఇచ్చి వివాహం చేస్తుంటారు. చాలా మంది యువతులు.. తల్లిదండ్రులు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నడుచుకుంటుంటారు. అయితే కొందరు యువతులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. బీహార్‌లో ఓ యువతి ఇలాగే చేసింది. పెళ్లైన మూడో రోజు భర్తకు పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి.. ఇంట్లోంచి పరారైంది. మర్నాడే భర్తకు వీడియో కాల్ చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

భర్తకు పాలల్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి పెళ్లైన మూడో రోజే ఇంట్లోంచి ఎస్కేప్.. మర్నాడే భార్య వీడియో కాల్ చేసి..

బీహార్ రాష్ట్రం కైమూర్ జిల్లాలోని సివోన్ గ్రామానికి చెందిన మహేంద్ర ప్రసాద్ తన పెద్ద కుమారుడు అమిత్ కుమార్‌కు.. రోహ్తాస్ జిల్లా కర్గహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బక్సారా గ్రామానికి చెందిన అవధేష్ ప్రజాపతి కుమార్తె ప్రీతి కుమారితో మే 9న వివాహం జరిగింది. మరుసటి రోజు అమిత్ ఇంటికి వెళ్లి... రెండు రోజులు అందరితో సరదాగా గడిపింది. 12వ తేదీ మధ్యాహ్నం అమిత్‌కు పాలల్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అతడు నిద్రలోకి జారుకోగానే ఉన్నట్టుండి ప్రీతి అదృశ్యమైంది. కాసేపటికి తేరుకున్న అమిత్.. ఇంట్లో పరిశీలించగా  ప్రీతితో పాటూ రూ.30 వేల నగదు, లక్షల విలువైన నగలు కనిపించలేదు. దీంతో అమిత్ కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే మర్నాడే అమిత్‌కు ప్రీతి వీడియో కాల్ చేసింది. ‘‘నాకు నీతో కలిసి ఉండాలని లేదు.. అందుకే వెళ్లిపోతున్నా.. రావాలని నాకు అనిపించినప్పుడు మళ్లీ వస్తా’’.. అని చెప్పిడంతో అవాక్కయ్యాడు.

పెళ్లిమంటపంలోనే వరుడిని చంపి.. నిన్ను తీసుకెళ్తా.. వధువుకు పక్కింటి యువకుడి ఫోన్‌కాల్.. చివరకు..

భర్తకు పాలల్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి పెళ్లైన మూడో రోజే ఇంట్లోంచి ఎస్కేప్.. మర్నాడే భార్య వీడియో కాల్ చేసి..

మోసపోయామని తెలుసుకున్న అమిత్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రీతి పెళ్లికి ముందే వేరే యువకుడితో ప్రేమలో ఉందని విచారణలో తెలిసింది. బలవంతంగా వివాహం చేయడంతో ప్రియుడితో కలిసి పారిపోయినట్లు వధువు బంధువులు తెలిపారు. ఇంట్లో అనుమానంగా తిరుగుతుంటే కొత్త కదా అనుకున్నామని, కానీ ఇలా చేస్తుందని తాము కలలో కూడా ఊహించలేదని అమిత్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మొబైల్ నంబర్ ఆధారంగా వధువును అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

చేతిలో పసిబిడ్డతో పోలీస్ స్టేషన్‌కు చేరుకుందో అమ్మాయి.. మైనర్ అయిన ఆమె చెప్పింది విన్న పోలీసులకు..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Viral Video: పెళ్లి వేడుకలో మహిళతో డాన్స్ చేస్తున్నాడో వ్యక్తి.. వారిద్దరి మధ్యలో ఓ కుర్రాడి ఎంట్రీ.. చివరకు..videoప్రేయసిని కలిసేందుకు వెళ్తే.. దగ్గరుండి మరీ పెళ్లి చేసి పంపించిన గ్రామస్తులు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..పెళ్లి విందుకు పిలవలేదని పక్కింటి వ్యక్తుల నిర్వాకమిది.. నేరుగా భోజనాల వద్దకు వెళ్లి..అసలు వీళ్లు తల్లిదండ్రులేనా..? 11 ఏళ్ల కొడుకు ఉన్న గదిలోకి 22 శునకాలను పంపించి.. రెండేళ్లుగా..భర్త మృతదేహం పక్కనే కూర్చుని ఏడుస్తున్న భార్య.. కోడలి ప్రవర్తనపై అత్తింట్లో డౌట్.. పోస్ట్‌మార్టం చేయిస్తే..కొద్ది గంటల్లో పెళ్లి జరుగుతుందనగా ఊహించని ఘటన.. పెళ్లి మంటపంలో కలకలం.. వరుడికి మైండ్‌బ్లాక్..!
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.