తిరుమల: శ్రీవారి ఆలయంలోని పరకామణి (Parakamani) మండపంలో చోరీ జరిగింది. బ్యాంకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేశ్వర ప్రసాద్ చోరికి పాల్పడ్డాడు. రూ. 20వేల నగదును చోరీ చేశాడు. భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తున్న సమయంలో వెంకటేశ్వర ప్రసాద్ నగదుతో భద్రతా సిబ్బందికి పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి టీటీడీ అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు CI జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి