
VIJAYAWADA: హీరో RAMCHARAN అభిమానులపై దుర్గమ్మ వారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆచార్య మూవీ విడుదల సందర్భంగా హీరో రామ్ చరణ్ ఇంద్రకీలాద్రికి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే రామ్ చరణ్ అభిమానులు ఆలయంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. రామ్ చరణ్‌ను చూసేందుకు ఎగబడ్డారు. అంతేకాదు అమ్మవారి ఆలయం అన్న సంగతి మర్చి హంగామా సృష్టించారు. ఆలయంలోని హుండీపైకి ఎక్కి అంతరాలయంలోని అమ్మవారిని, రామ్ చరణ్‌ను ఫొటోలు తీశారు. ఆలయంలో జై రామ్ చరణ్ అంటూ నినాదాలు చేశారు. దీంతో భక్తులు మండిపడుతున్నారు. దుర్గగుడిలో అపచారం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆలయంలోని హుండీలకు అధికారులు సంప్రోక్షణ చేశారు.
ఇవి కూడా చదవండి