‘గిరి’ గ్రామాల్లో నీటిఎద్దడి

ABN , First Publish Date - 2022-05-03T06:23:37+05:30 IST

ఏజెన్సీ గిరిజన గ్రామాల ప్రజలకు యేటా తాగునీటి తంటాలు తప్పడం లేదు. అసలే వేసవి కాలం కావడంతో ఆదివాసీల కష్టాలు వర్ణణాతీతం. మండుటెండల్లో గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నా రు. చెంబెడు నీటి కోసం చెట్లు, గుట్టలు వెంబడి పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది.

‘గిరి’ గ్రామాల్లో నీటిఎద్దడి
వాగులో బట్టలు ఉతకడానికి వెళ్తున్న గిరిజన మహిళలు

ఉట్నూర్‌ ఏజెన్సీ గిరిజన గ్రామాలలో తాగునీటి కోసం తంటాలు 

గుక్కెడు నీటి కోసం చెట్లు, గుట్టల వెంబడి మహిళల పరుగులు

వాగులు, వంకల వద్దే స్నానాలు, బట్టలు ఉతుక్కుంటూ.. ఇతర పనులు

అడుగంటిపోతున్న భూగర్భ జలాలు

పలుచోట్ల వట్టిపోతున్న బోరుబావులు

ఉన్నకొద్దిపాటి కలుషిత నీటితో రోగాలు

పల్లెల్లో పనిచేయని మంచినీటి పథకాలు

పలుచోట్ల భగీరథ పైప్‌లైన్లకు లీకేజీలు

ప్రతీయేటా మారుమూల ఆదివాసీ ప్రాంతాల్లో నీటితిప్పలు


ఉట్నూర్‌, మే 2: ఏజెన్సీ గిరిజన గ్రామాల ప్రజలకు యేటా తాగునీటి తంటాలు తప్పడం లేదు. అసలే వేసవి కాలం కావడంతో ఆదివాసీల కష్టాలు వర్ణణాతీతం. మండుటెండల్లో గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నా రు. చెంబెడు నీటి కోసం చెట్లు, గుట్టలు వెంబడి పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది.  కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తు తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగునీటి పథకాలు నిర్మించిన గిరిజన గ్రామాలలో ప్రజల కు మంచినీటి ఇబ్బందులు తప్పడం లేదు. ముదిరిన ఎండలతో భూగర్భ జలా లు అడుగంటి పోతుండడంతో బోరుబావుల్లో సైతం నీరు తగ్గిపోతోంది. ఫలితంగా గిరిజన గ్రామాల ప్ర జలు మంచినీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు.  

ఫ వట్టిపోతున్న పథకాలు

గిరిజన గ్రామాలకు తాగునీరు సరఫరా చేయడానికి కుమ్రం భీం జిల్లా ఆడ ప్రాజెక్టు నుంచి వేసిన పైపు లైన్‌ ద్వారా  ఉట్నూర్‌, ఇంద్రవెల్లి మండలాలకు సరైన విధంగా మంచినీరు సరఫరా కావడం లేదు. ప్రతీ గ్రామంలో మిషన్‌ భగీరథ ట్యాంకులు నిర్మించి పైపు లైన్‌లు నిర్మించినప్పటికీ చాలా చోట్ల లీకేజీలు ఏ ర్పడి మంచినీటి పథకాలు వట్టిపోతున్నాయి. సోయినూర్‌ సమీపంలో నిర్మించిన పంపు ద్వారా సరైన విధంగా నీరు అందడం లేదు. తరచు లీకేజీలు ఏర్పడుతున్నాయని గ్రామీణులు పేర్కొంటున్నారు. ఉట్నూర్‌ మండలంలోని మారుమూల గ్రామాలైన శాంతాపూర్‌, రాజులమడుగు గ్రామాలు దట్టమైన అటవీ ప్రాంతం లో ఉన్నప్పటికీ గిరిజనులు వాగునీరుపై ఆధారపడుతున్నారు. రాజులమడుగు లో లక్షలాది రూపాయలతో నిర్మించిన మంచినీటి పథకం  వెక్కిరిస్తోందని, చుక్క నీరు రావడం లేదని గ్రామంలో 25 కుటుంబా లు ఉన్నప్పటికీ రెండు బోరుబావులు వేసిన అధికారులు ఒక బోరుబావి చెడిపోయినా.. పట్టించుకోవడం లేదని గ్రామ పటేల్‌ ఆనంద్‌రావు తెలిపారు. ట్యాంకు నిర్మించి  నాలుగేళ్లు గడుస్తున్న చుక్క నీరు రాలేదని వాపోతున్నా రు. శాంతాపూర్‌ గ్రామంలో 20 కుటుంబాలు ఉండగా, శాంతాపూర్‌ కొలాంగూడలో పది కుటుంబాలు జీవిస్తున్నాయి. ఐదేళ్ల క్రితం ఈ గ్రామాల ప్రజలకు మంచినీరు అందించడానికి ఒక్కో గ్రామంలో రూ.లక్షలాది వెచ్చించి సోలార్‌ ట్యాంకుల ద్వారా నీరును అందించారు. అవి కాస్తా చెడిపోవడంతో ఆ గిరిజనులు  బోరుబావులపై ఆధారపడ్డారు. కొలాంగూడలో ఉన్న ఒకే ఒక్కబోరులో కలుషిత నీరు వస్తోందని,  గత్యంతరం లేక అవే తాగుతున్నామని గ్రామ పటేల్‌ సిడాం రాము తెలిపారు. 20 కుటుంబాలు ఉన్న శాంతాపూర్‌ గోండుగూడలో రెండు బోరుబావులు ఉన్నప్పటికీ.. ఒక్క బోరుబావిలోనే నీరు వస్తోందని, ఫలితంగా గ్రా మస్థులు 2కి.మీ. దూరంలో ఉన్న వాగు వద్దకు వెళ్లి స్నానాలు, బట్టలు ఉతుకోవడం తప్పడం లేదని గ్రామ  పటేల్‌ జూగాదిరావు ఆత్రం తెలిపారు. ఇదే కాకుండా ఘన్‌పూర్‌లో నూ తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎంపీపీ గ్రామమైనప్పటి కీ అధికారులు పూర్తిగా పనులు చేయడం లేదని ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు వాపోయా రు. ఇప్పటికైనా తాగునీటి కష్టాలను తీర్చడానికి అధికారులు కృషి చేయాలని  స్థానికులు కోరుతున్నారు.

నీటికష్టాలు తీరుస్తాం : : శ్రీనివాస్‌, డీఈఈ, ఉట్నూర్‌

గిరిజన గ్రామాలలో తాగునీటి కష్టాలను తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం. గత కొన్ని రోజులుగా ఆడ ప్రాజెక్టు నుంచి సాంకేతిక సమస్యలు రావడంతో తాగునీటి ఇబ్బం దులు ఏర్పడ్డాయి. బోరుబావుల మరమ్మతుల సర్పంచ్‌ల ద్వారా చేయిస్తున్నాం. మంచినీటి పథకాలకు చెందిన పైపు లైన్‌ల లీకేజీలను సత్వరంగా పూర్తి చేస్తాం.


తాగునీటి సమస్యను పరిష్కరించండి సారూ!

ఐటీడీఏ కార్యాలయానికి ఎడ్లబండ్లపై తరలివచ్చిన ఆదివాసీలు

ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని మండిపాటు

కనీస సౌకర్యాలు సమకూర్చాలని పీవోకు చాప్రాల మత్తడి వాసుల విన్నపం 

ఉట్నూర్‌: తమ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మండలంలోని చాప్రాల మత్తడి ఆదివాసీ గిరిజను లు ఎడ్లబండ్లతో తరలి వచ్చి ఐటీడీఏ పీవో క్యాంపు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. సోమవారం ఐటీడీఏకు చేరుకున్న గిరిజనులు గత నెలలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో  సైతం తాము ధర్నా కు తలపడితే ఐటీడీఏ పీవో అంకిత్‌ తమ గ్రామాన్ని సందర్శించి తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ హామీ అమలు కాలేదని, అందుకే ఈ రోజు ఎడ్లబండ్లతో తరలి వచ్చి ధర్నా నిర్వహిస్తున్నామ ని గిరిజనులు పేర్కొన్నారు. వేసవి కాలంతో పాటు ఇతర కాలాల్లో కూడ తాము తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామని, ఇంటింటికీ ఎడ్లబండితో పాటు బ్యారేల్‌ ఏర్పాటు చేసుకున్నామని ఇప్పటికైన తమ తాగునీటి సమస్యను పరిష్కరించి గ్రామానికి రోడ్డు, అంగన్‌వాడీ స్కూల్‌ ఏర్పాటుచేయాలని, వాగుపై వంతెన నిర్మించాలని గిరిజనులు ఐటీడీఏ పీవోను వేడుకున్నారు. దీంతో పీవో స్పందిస్తూ.. ట్యాంకర్‌ ద్వారా తాగునీరు పంపించి మంచినీటి ఎద్దడి పరిష్కరిస్తామని, అదేవిధంగా మిషన్‌ భగీర థ పథకం ద్వారా సమస్య పరిష్కరిస్తామని పీవో హామీ ఇచ్చారు. ఇందు లో మల్కు, గణేష్‌, రాజు పటేల్‌, తదితరులు పాల్గొన్నారు. 

Read more